Turmeric: ప్రతి కూరగాయలు, వంటలలో పసుపు పొడిని ఖచ్చితంగా కలుపుతారు. ఇది.. ఆహారం రంగును మార్చడమే కాకుండా.. శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉంటే పసుపు కూడా దాని నుంచి ఉపశమనం ఇస్తుంది. పసుపులో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద డాక్టర్లు అంటున్నారు. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. మనం నిత్యం వంట చేసే గదిలో ఖచ్చితంగా పసుపు ఉంటుంది. అది లేకుండా ఎలాంటి కూడా వండరు. అసలైన.. పసుపు పొడి గురించి చాలా మందికి తెలియదు. పసుపు పెయిన్ కిల్లర్ కంటే మెరుగైనదిగా చెబుతున్నారు. శరీరంలోని రోగాలకు శత్రువు కావడానికి ఇదే కారణం. పసుపుని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పాలలో కలిపి తాగాలి
- శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉంటే గ్లాసు వేడి పాలలో పసుపు వేసి అందులో కొద్దిగా బెల్లం వేసుకోని రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇలా తాగటం వలన శరీరానికి మంచి ఉపశమనం దొరుకుతుంది. పసుపులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు నొప్పి ఉన్న దగ్గర చాలా ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాకుండా.. ఎప్పుడైనా జలుబు, దగ్గు ఉన్నప్పుడు పాలలో పసుపు వేసుకోని తాగడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.
మోకాళ్ల నొప్పులకు..
- నొప్పులకు పసుపును వాడేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కీళ్ల నొప్పులు అందరికి వస్తున్నాయి. ఇలాంటి సమస్య ఉంటే.. అందులో కొద్దిగా పసుపు, అలోవెరా జెల్, వేడి ఆవాల నూనె కలుపుకోవాలి. ఈ మూడింటి మిశ్రమాన్ని తయారు చేసుకున్న తరువాత మోకాళ్లకు అప్లై చేసి పైన బ్యాండేజ్ కట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. ఇలాస్తే..మోకాళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.
గాయంపై అప్లై..
- ఎక్కడైనా పడిపోయి చేతులు, కాళ్లకు గాయం అవుతుంది. అంతేకాదు అది చాలా నొప్పిగా ఉంటుంది. దీనికోసం పసుపు పొడి,కొద్దిగా సున్నం తీసుకుని రెండింటినీ నీరు పోసి కలపాలి. నొప్పి ఉన్న దగ్గర ఈ పేస్ట్‌ను రాసుకోవాలి. ఇలా చేస్తే నొప్పి తగ్గుతుంది.
ఇది కూడా చదవండి: పొరపాటున కూడా వీటిని రీ-హీట్ చేసి తినవద్దు, తాగవద్దు.. డేంజర్‌లో పడినట్టే!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.