IIT-BHU: ఆ యూనివర్సిటీలో మహిళను వివస్త్రను చేశారు.. విద్యార్థుల ఆందోళనలు

బనారస్ యూనివర్సిటీలో ఓ మహిళను వేధించడంతో అక్కడి విద్యార్థులు ఆందోళన చేయడం చర్చనీయాంశమైంది. క్యాంపస్‌లో ఆమె తన స్నేహితుడుతో కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా.. ముగ్గురు బయటి వ్యక్తులు ఆమెను బలవంతంగా లాక్కెళ్లి కిస్ చేసి, వివస్త్రను చేయడం కలకలం రేపింది.

New Update
IIT-BHU: ఆ యూనివర్సిటీలో మహిళను వివస్త్రను చేశారు.. విద్యార్థుల ఆందోళనలు

ఓ మహిళా విద్యార్థిని కిస్ చేసి, బట్టలు లాగేసిన ఘటనను నిరసిస్తూ వారణాసిలోని బనారస్ హిందూ యూనిర్సిటీలో వందల సంఖ్యలో విద్యార్థులు నిరసనలు చేపట్టారు. హస్టల్ హాల్ వద్ద ప్రదర్శనలు చేశారు. బైక్‌పై క్యాంపస్‌లోకి చొరబడిన ముగ్గురు వ్యక్తులు నీచమైన చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఘటనలో బయటి వ్యక్తుల భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రాత్రి ఓ మహిళా విద్యార్థిని క్యాంపస్‌లో స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లింది. అయితే ఆ సమయంలో ఆమెపై దాడి జరిగింది. కర్మన్ బాబా ఆలయం వద్ద ఉన్నప్పుడు.. ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి తనను బలవంతంగా లాక్కెళ్లారని బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత ఆ ముగ్గురు నిందితులు తనతు కిస్ చేసి విసస్త్రను చేశారని.. అలాగే ఇందుకు సంబంధించి వీడియోలు, ఫొటోలు తీశారని చెప్పింది. ఈ మేరకు ఆమె పోలీసులకిచ్చిన ఫిర్యాదులో ఈ విషయాలు వెల్లడించింది.

Also Read: ప్లీజ్ నన్ను మైలార్డ్ అని పిలవకండి…

అయితే ఈ విషయం యూనివర్సిటీ విద్యార్థులకు తెలియడంతో తీవ్ర దుమారం రేపింది. క్యాంపస్‌లోకి బయటి వ్యక్తులు ప్రవేశించకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. అలాగే బీహెచ్‌యూ క్యాంపస్ నుంచి ఐఐటీ క్యాంపస్‌ను వేరు చేయాలని.. మధ్యలో గోడ కట్టాలని విద్యార్థులు డిమడ్ చేస్తున్నారు. అయితే దీనిపై విద్యాశాఖ నిర్ణయం తీసుకోనున్నట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. అలాగే క్యాంపస్‌లో సెక్యురిటీని పటిష్ఠం చేస్తామని రిజిస్ట్రార్ చెప్పారు. అలాగే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విద్యార్థుల కదలికలపై కూడా ఆంక్షలు విధించనున్నారు.

Advertisment
తాజా కథనాలు