Dussehra Special Trains: దసరా స్పెషల్.. సికింద్రాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక ట్రైన్లు.. టైమింగ్స్ ఇవే!

సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ప్రయాణికులకు మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పండుగ సెలవులతో పాటు ప్రయాణీకుల రద్దీని కూడా దృష్టిలో పెట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏడు స్పెషల్‌ ట్రైన్స్‌ నడుపుతున్నట్లు వివరించింది. ఈ నెల 19 నుంచి అంటే గురువారం నుంచి ఈ 7 రైళ్లు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.

Big Breaking : పట్టాలు తప్పిన సుహెల్‌దేవ్ ఎక్స్‌ప్రెస్‌..!!
New Update

Dussehra Special Trains to AP: దసరా సెలవులు (Dussehra Holidays) ఇవ్వడంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు జనాలతో రద్దీగా తయారు అయ్యాయి. ఈ క్రమంలోనే సౌత్‌ సెంట్రల్‌ రైల్వే (SCR) ప్రయాణికులకు మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పండుగ సెలవులతో పాటు ప్రయాణీకుల రద్దీని కూడా దృష్టిలో పెట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏడు స్పెషల్‌ ట్రైన్స్‌ నడుపుతున్నట్లు వివరించింది.

ఈ నెల 19 నుంచి అంటే గురువారం నుంచి ఈ 7 రైళ్లు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. దసరా రోజు వరకు వీటిని నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు ఇవి అందుబాటులో ఉంటాయని వివరించారు. అక్టోబర్‌ 19 న నర్సాపూర్‌- సికింద్రాబాద్‌ రైలు సాయంత్రం 6 గంటలకు, సికింద్రాబాద్‌ - తిరుపతి (Secunderabad - Tirupati) స్పెషల్‌ ట్రైన్ రాత్రి 8 గంటలకు బయల్దేరతాయని రైల్వే అధికారులు తెలిపారు.

Also read: టపాసుల గోడౌన్‌ లో భారీ పేలుడు..పది మంది మృతి!

అక్టోబర్‌ 20 న తిరుపతి- సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు రాత్రి 7: 50 గంటలకు, సికింద్రాబాద్‌ - కాకినాడ రైలు రాత్రి 9 గంటలకు మొదలవుతాయి. కాకినాడ-సికింద్రాబాద్‌ స్పెషల్‌ ట్రైన్‌ రాత్రి 21 వ తేదీ రాత్రి 8 గంటలకు 10 నిమిషాలకు స్టార్ట్‌ అవుతుంది. సికింద్రాబాద్- కాకినాడ ప్రత్యేక రైలు రాత్రి 7 గంటలకు, 24 న కాకినాడ- సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు రాత్రి 9 గంటలకు బయల్దేరుతుంది.

ఈ రైళ్లలో జనరల్‌, స్లీపర్‌, ఏసీ అన్ని తరగతుల కోచ్‌ లు ఉంటాయి. ఇక ఏపీతో పాటు మిగతా రాష్ట్రాలకు స్పెషల్ ట్రైన్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. షిర్డీ, జైపూర్, రామేశ్వరంతో పాటు రద్దీ గల ఇతర ప్రధాన ప్రాంతాలకు స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.

Also Read: పగటి వెలుగుతో టైప్‌ 2 మధుమేహనికి చెక్‌!

దసరా నేపథ్యంలో సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది తెలంగాణ ఆర్టీసీ (TSRTC). ప్రయాణికుల సౌకర్యం కోసం జూబ్లీ బస్ స్టేషన్ (JBS) మీదుగా విజయవాడకు బస్సులను నడపాలని నిర్ణయించింది. బీహెచ్ఈఎల్/మియాపూర్ నుంచి బయలుదేరే 24 సర్వీసులను ఎంజీబీఎస్ నుంచి కాకుండా జేబీఎస్ మీదుగా నడపనున్నట్లు ప్రకటించింది. ఆ సర్వీసులు కేపీహెచ్ బీ కాలనీ, బాలానగర్, బోయిన్ పల్లి, జేబీఎస్, సంగీత్ (పుష్పక్ పాయింట్), తార్నాక (పుష్పక్ పాయింట్), హబ్సిగూడ (పుష్పక్ పాయింట్), ఉప్పల్ (పుష్పక్ పాయింట్) , ఎల్బీనగర్ మీదుగా విజయవాడకు (Vijayawada) నడుస్తాయని ఆర్టీసీ తెలిపింది.

అక్టోబర్ 18 నుంచే ఈ 24 సర్వీసులు ఆ మార్గంలో రాకపోకలు సాగిస్తాయని ఆర్టీసీ వెల్లడించింది. జేబీఎస్ మీదుగా వెళ్లే ఈ బస్సుల టికెట్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని తెలిపింది ఎంజీబీఎస్ నుంచి నడిచే సర్వీసుల మాదిరిగానే చార్జీలుంటాయని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఈ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in ను సంప్రదించాలని వెల్లడించింది.

ప్రస్తుతం బీహెచ్ఈఎల్/మియాపూర్ నుంచి వచ్చే బస్సులు ఎంజీబీఎస్ మీదుగా విజయవాడకు వెళ్తున్నాయి. దీంతో జేబీఎస్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల ప్రయాణికులు ఎంజీబీఎస్ కు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ విషయాన్ని కొందరు ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. జేబీఎస్ మీదుగా విజయవాడకు బస్సులను నడపాలని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తుల మేరకు మొదటగా 24 సర్వీసులను జేబీఎస్ మీదుగా విజయవాడకు నడపాలని సంస్థ నిర్ణయించింది. బోయిన్ పల్లి, సికింద్రాబాద్, జేబీఎస్, తార్నాక, హబ్సిగుడ, ఉప్పల్ ప్రాంతాల ప్రయాణికులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ కోరింది.

#telangana #hyderabad #ap #dussehra-2023 #dussehra-special-trains-to-ap
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe