Framers Protest In Delhi:ఢిల్లీ చుటుటపక్కల రైతులు కొన్నాళ్ళ క్రితం ధర్నాలు, ఆందోళనలతో కొన్ని నెలలు గడగడలాడించారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ రైతు సంఘాలు(Farmers) ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. చలో ఢిల్లీ (Chalo Delhi)నినాదంతో రైతులు ఢిల్లీకి చేరుకోవాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో డిల్లీ నాలుగు బోర్డర్లలో, ముఖ్యమైన మార్గాల్లో బారికేడ్లు, బండరాళ్లును అధికారులు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 13 అంటే రేపు రైతలు ధర్నా చేయకుండా ఎక్కడిక్కడే కట్టడి చేస్తున్నారు. బోర్డర్లను దాదాపు చూసేసారు. దీంతో ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 10, 20 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. లోథి బోర్డర్, ఘాజీపూర్ బోర్డర్, చిల్లా బోర్డర్, కలిదిన్ కుంజ్-డీఎన్‌డీ-నోయిడా బోర్డర్ వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. దీని వల్ల ప్రజలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే, హర్యానా, పంజాబ్ నుండి ఇంటర్‌స్టేట్ బస్సుల ద్వారా వచ్చే ప్రజలు కూడా సమస్యలను ఎదుర్కొంటారు, ఎందుకంటే సింగు సరిహద్దును అధికారులు మూసివేశారు.
Also Read:Andhra Pradesh:ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
ఢిల్లీలో 144 సెక్షన్...
ఇప్పటికే భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన ఢిల్లీ పోలీసులు తాజాగా నగరంలో 144 సెక్షన్‌ను కూడా విధించారు. రేపటి నుంచి వచ్చే నెల 12 వరకు ఢిల్లీ అంతటా 144 సెక్షన్ అమలు లో ఉంటుందని చెప్పారు. మరోవైపు బోర్డ్ర్ల దగ్గర 5వేల మంది కంటే ఎక్కువ భధ్రతా సిబ్బందిని మోహరించారు. ఢిల్లీలోకి ట్రాక్టర్ల ప్రవేశానికి అనుమతి లేదని తెలిపారు. లౌడ్ స్పీకర్లను వాడడం, మండే పదార్ధాలు, తుపాకులు వంటి వాటినికూడా నిషేధించారు.
తమ డిమాండ్లను నేరవేర్చాలని పట్టు..
ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్ రైతులు రేపు మోర్చా నిర్వహించనున్నారు. కనీస మద్దుతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటూ తమ ఇతర డిమాండ్లను కూడా పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. సుమారు 200కు పైగా రైతు సంఘాలు ఛలో ఢిల్లీ మార్చ్‌ని నిర్వహించనున్నాయి. 2021లో ఇలాగే రైతులు ఆరు నెలలపాటూ ధర్నా నిర్వహించారు.