Elections 2024 : కొనసాగుతున్న రెండో దశ పోలింగ్..ఓటేసిన ప్రముఖులు

లోక్‌సభ రెండో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభైన పోలింగ్‌లో పలువురు ప్రముఖులు ఓటేసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం ఆరు వరకు పోలింగ్ కొనసాగనుంది.

New Update
Elections 2024 : కొనసాగుతున్న రెండో దశ పోలింగ్..ఓటేసిన ప్రముఖులు

Second Stage Poling : 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో రెండో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలైంది. నిజానికి రెండో దశలో 89 స్థానాలకు పోలింగ్‌ జరగాల్సి ఉంది. కానీ మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) లోని బైతూల్‌ లోక్ సభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీఎస్పీ అభ్యర్థి మృతి చెందడంతో అక్కడ పోలింగ్ ను ఎన్నికల కమిషన్‌(Election Commission) మే 7వ తేదీకి వాయిదా వేసింది.

ఈ రాష్ట్రాల్లో ఇన్ని స్థానాలకు పోలింగ్...
కేరళ(Kerala) లోని మొత్తం 20 లోక్‌సభ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. అలాగే రాజస్థాన్‌లో మొత్తం స్థానాలు 25 ఉండగా.. 12 స్థానాలకు తొలి దశలో పోలింగ్‌ ముగిసింది. ఇప్పుడు రెండో దశలో మిగతా స్థానాలు 13 కు పోలింగ్‌ జరుగుతోంది. కర్ణాటక 14, ఉత్తర్‌ప్రదేశ్‌ 8, మహారాష్ట్ర 8, మధ్యప్రదేశ్‌ 6, బిహార్‌ 5, అస్సాం 5, పశ్చిమ బెంగాల్‌ 3, ఛత్తీస్‌గఢ్‌ 3, జమ్మూకశ్మీర్‌ 1, మణిపుర్‌ 1, త్రిపుర 1 స్థానాల్లో నేడు పోలింగ్‌ కొనసాగుతోంది. అన్ని చోట్లా ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ సమయం నిర్దేశించగా..ఛత్తీస్‌ఘడ్‌లో మాత్రం వడగాడ్పుల కారణంగా పోలింగ్ సమయాన్ని మరో రెండు గంటలు పొడిగించారు. అంటే అక్కడ రాత్రి 7 వరకు పోలింగ్ జరగనుంది.

ఓటేసిన ప్రముఖులు...
రెండో దశ పోలింగ్‌లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయమే క్యూ లైన్లలో నిల్చుని మరీ ఓటేశారు. అలప్పుళ నుంచి కాంగ్రెస్(Congress) అభ్యర్థిగా ఉన్న కేసీ వేణుగోపాల్ ఓటేశారు. కేరళలోని కన్నూరక్ లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఓటేశారు. ఇక బెంగళూరులో మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, అనిల్‌ కుంబ్లే బెంగళూరులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ బెంగళూరులోని పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిల్చొని ఓటు వేశారు. ప్రజలంతా ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. తిరువనంతపురం కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్‌ , బెంగళూరులో ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ బెంగళూరు సౌత్‌ అభ్యర్థి తేజస్వీ సూర్య, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఆయన సతీమణి సుధా మూర్తి, కేంద్రమంత్రి, బెంగళూరు నార్త్‌ అభ్యర్థి శోభా కరంద్లాజె, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి హర్ష వర్ధన్‌ శింగ్లా, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్ కుటుంబం, పశ్చిమ్‌ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్‌ బోస్‌, కేంద్రమంత్రి, జోధ్‌పుర్ అభ్యర్థి గజేంద్ర సింగ్ షెకావత్, భాజపా తిస్సూర్‌, పథనంథిట్ట అభ్యర్థులు సురేశ్‌ గోపి, అనిల్ ఆంటోనీ ఓటు వేశారు. ‘చిరుత’ బ్యూటీ నేహా శర్మ బిహార్‌లో, మలయాళీ నటుడు టొవినో థామస్ కేరళలో ఓట్లు వేశారు.

Also Read:Supreme Court: వీవీ ప్యాట్ల లెక్కింపు కుదరదు-సుప్రీంకోర్టు

Advertisment
తాజా కథనాలు