ఇక భారత్ జోడో యాత్ర రెండో దశ.. ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే...!

భారత్ జోడో యాత్ర మంచి సక్సెస్ ఫుల్ అయింది. దేశ వ్యాప్తంగా వున్న ప్రజలను కాంగ్రెస్ కు దగ్గర చేయడంలో ఈ యాత్ర కీలక పాత్ర పోషించింది. అటు పార్టీ శ్రేణుల్లోనూ మంచి జోష్ నింపింది. తాజాగా భారత్ జోడో యాత్ర రెండవ దశ పాదయాత్రను చేపట్టనున్నట్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు

author-image
By G Ramu
New Update
ఇక భారత్ జోడో యాత్ర రెండో దశ.. ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే...!

భారత్ జోడో యాత్ర మంచి సక్సెస్ ఫుల్ అయింది. దేశ వ్యాప్తంగా వున్న ప్రజలను కాంగ్రెస్ కు దగ్గర చేయడంలో ఈ యాత్ర కీలక పాత్ర పోషించింది. అటు పార్టీ శ్రేణుల్లోనూ మంచి జోష్ నింపింది. తాజాగా భారత్ జోడో యాత్ర రెండవ దశ పాదయాత్రను చేపట్టనున్నట్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. పశ్చిమ రాష్ట్రం గుజరాత్ నుంచి మొదలు పెట్టి ఈశాన్య రాష్ట్రం మేఘాలయ వరకు ఈ యాత్ర కొనసాగనున్నట్టు తెలిపారు.

రాహుల్ గాంధీ యాత్ర విషయాన్ని మహారాష్ట్ర పీసీసీ చీఫ్ నానా పటోలే వెల్లడించారు. భారత్ జోడో యాత్రకు సమాంతరంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ నేతలు యాత్ర చేపడతారని చెప్పారు. ఈ యాత్ర కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి లోక్ సభ నియోజక వర్గం నుంచి 48 మంది పరిశీలకులను నియమించనున్నట్టు చెప్పారు.

తూర్పు విదర్భలో నిర్వహించే యాత్రకు తాను నాయకత్వం వహిస్తానన్నారు. ముంబైలో వర్ష గైక్వాడ్, పశ్చిమ విదర్భ నుంచి విజయ్ వాడెట్టివార్, ఉత్తర మహారాష్ట్ర బాలా సాహిబ్ థోరట్, మరఠ్వాడాలో అశోక్ చవాన్, పశ్చిమ మహారాష్ట్ర నుంచి పృథ్విరాజ్ చవాన్ యాత్రకు నాయకత్వం వహిస్తారన్నారు. వారంతా చివరకు కొంకణ్ కు చేరుకుంటారని వివరించారు.

గతేడాది సెప్టెంబర్‌లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొదటి ఫేజ్ యాత్ర ప్రారంభం అయింది. తమిళనాడు నుంచి కశ్మీర్ వరకు ఈ యాత్ర కొనసాగింది. మొత్తం 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల గుండా ఈ యాత్ర కొనసాగింది. జనవరి 30తో యాత్ర ముగిసింది. ఇక యాత్ర ముగిసిన రెండు నెలలకే పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి శిక్ష విధించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు