Bird Flu : వేగంగా విజృంభిస్తున్న బర్డ్‌ ఫ్లూ.. అక్కడ చికెన్‌ బంద్‌!

అమెరికాలో బర్డ్‌ ఫ్లూ కలకలం రేపుతోంది. టెక్సాస్‌, కాన్సాస్‌ వంటి రాష్ట్రాల్లో డైరీ ఫామ్‌ లోని ఆవు పాలల్లో.. పౌల్ట్రీలోని కోళ్లలో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు అధికారులు నిర్థారించారు. కోళ్లల్లో బర్డ్‌ ఫ్లూ కనిపించడంతో టెక్సాస్‌ ప్లాంట్‌ లో తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Bird Flu : వేగంగా విజృంభిస్తున్న బర్డ్‌ ఫ్లూ.. అక్కడ చికెన్‌ బంద్‌!
New Update

America : అగ్ర రాజ్యం అమెరికాలో బర్డ్‌ ఫ్లూ కలకలం రేపుతోంది. అమెరికాలోని టెక్సాస్‌, కాన్సాస్‌ వంటి రాష్ట్రాల్లో డైరీ ఫామ్‌ లోని ఆవు పాలల్లో.. పౌల్ట్రీలోని కోళ్లలో బర్డ్ ఫ్లూ(Bird Flu) ఉన్నట్లు అధికారులు నిర్థారించారు. కోళ్లల్లో బర్డ్‌ ఫ్లూ కనిపించడంతో టెక్సాస్‌ ప్లాంట్‌ లో తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

అంతేకాకుండా చికెన్ ను కూడా బంద్‌(Chicken Bandh) చేసినట్లు సమాచారం. అలాగే టెక్సాస్(Texas) లోని రిడ్జ్‌ ల్యాండ్‌ లో సుమారు 1.6 మిలియన్ల కోళ్లు చనిపోయాయి. ఆవులతో సంబంధం ఉన్న వ్యక్తికి కూడా బర్డ్ ఫ్లూ ఉన్నట్లు నిర్దారణ అయ్యింది. ప్రజలకు వచ్చే ప్రమాదం తక్కువగానే ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్య అధికారులు తెలిపారు.

ఆకలి లేకపోవడం,బద్దకం వంటి లక్షణాలను ఆవుల్లో గుర్తించడంతో అవి ఈ వైరస్‌ బారిన పడినట్లు నిపుణులు గుర్తించారు. అందుకే ఆవు పాలను బాగా తగ్గించినట్లు రైతులు వివరిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న గుడ్లతో బర్డ్‌ ఫ్లూ వచ్చే అవకాశాలు లేవని.. అందుకే వాటిని వెనక్కి తీసుకోవడం లేదని డాక్టర్లు తెలిపారు.

Also read: మా దగ్గర ఖాళీల్లేవు.. మంత్రిగారు: కేంద్ర మంత్రి హార్దీప్ సింగ్‌!

#bird-flu #texas #america
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి