HIV: వైద్యశాస్త్రంలో అద్భుతం.. హెచ్‌ఐవీకి చికిత్స

హెచ్‌ఐవీ మహమ్మారిని క్రిస్‌పర్‌ (CRISPR) జీన్‌-ఎడిటింగ్ అనే టెక్నాలజీ సాయంతో విజయవంతంగా తొలగించినట్లు నెదర్లాండ్‌లోని ఆమ్‌స్టర్‌డ్యామ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం తెలిపింది.అయితే ఈ చికిత్స పూర్తిగా అందుబాటులోకి రావడానికి కొన్నేళ్లు పట్టొచ్చు.

New Update
HIV: వైద్యశాస్త్రంలో అద్భుతం.. హెచ్‌ఐవీకి చికిత్స

ప్రపంచ దేశాలను వణికిస్తున్న వైరస్‌లలో హెచ్‌ఐవీ (HIV) ఒకటి. 1959లో ఆఫ్రికాలోని కాంగోలో మొదటిసారిగా ఓ వ్యక్తి హెచ్‌ఐవీ వల్ల చనిపోయాడు. అప్పటినుంచి క్రమంగా ఈ వ్యాధికి గురై చనిపోయేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటివరకు ఈ వ్యాధికి సరైన చికిత్స లేదు. అయితే తాజాగా ఈ మహమ్మారికి సంబంధించి శాస్త్రవేత్తలు గుడ్‌న్యూస్‌ తెలిపారు. ఇకనుంచి హెచ్‌ఐవీని పూర్తిగా నయం చేయొచ్చని అంచనా వేస్తున్నారు.

Also Read: కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై అన్నా హజారే షాకింగ్‌ రియాక్షన్.. ఏం అన్నారంటే?

వైరస్‌ నుంచి విముక్తి చేయొచ్చు

ఇక వివరాల్లోకి వెళ్తే.. నెదర్లాండ్‌లోని ఆమ్‌స్టర్‌డ్యామ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం హెచ్‌ఐవీకి సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. క్రిస్‌పర్‌ (CRISPR) జీన్‌-ఎడిటింగ్ అనే సాంకేతిక సాయంతో హెచ్‌ఐవీని విజయవంతంగా తొలగించినట్లు పేర్కొన్నారు. మాలిక్యులర్ కటింగ్ అనే విధానం ద్వారా శాస్త్రవేత్తలు హెచ్‌ఐవీ సోకిన కణాల డీఎన్‌ఏ (DNA)ను తొలగించగలిగారు. అయితే ఈ సాంకేతికత ముందుగా సూక్ష్మ స్థాయిలో కత్తెరలా పనిచేసి చెడు భాగాన్ని తొలగిస్తుంది. ఆ తర్వాత ఇది శరీరాన్ని పూర్తిగా హెచ్‌ఐవీ వైరస్‌ నుంచి విముక్తి చేయగలదని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

టైం పడుతుంది

క్రిస్‌పర్‌ జీన్‌-ఎడిటింగ్ టెక్నాలజీ ఎంత ప్రభావవంతంగా ఉంటుందో తెలియడానికి మరింత పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని.. నాటింగ్‌హామ్ యూనివర్సిటీలోని స్టెమ్ సెల్, జీన్ థెరపీ టెక్నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డా. జేమ్స్ డిక్సన్ పేర్కొన్నారు. ఈ చికిత్స విధానాంలో చాలా సవాళ్లు ఉన్నాయని.. దీనివల్ల ఈ చికిత్స పూర్తిగా అందుబాటులోకి రావడానికి కొన్నేళ్లు పట్టొచ్చని లండన్‌లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్‌లోని వైరస్ నిపుణుడు డా. జోనాథన్ స్టోయ్ తెలిపారు.

Also Read: మెక్సికో మోడల్ తో జొమాటో సీఈవో సీక్రెట్ మ్యారేజ్.. హనీమూన్ తర్వాత ఎక్కడ ఉన్నారంటే.. 

Advertisment
తాజా కథనాలు