Telangana Elections: ఎన్నికల వేళ.. అక్కడ రేపు, ఎల్లుండి విద్యాసంస్థలు బంద్..

నవంబర్‌ 30న తెలంగాణలో పోలింగ్ జరగనున్న వేళ.. హైదరాబాద్‌లో రేపు(బుధవారం), ఎల్లుండి(గురువారం) అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి ఎక్స్‌(ట్విట్టర్)లో ఈ విషయాన్ని వెల్లడించారు.

New Update
Telangana Elections: ఎన్నికల వేళ.. అక్కడ రేపు, ఎల్లుండి విద్యాసంస్థలు బంద్..

తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈరోజు (మంగళవారం) సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది. సమయం అయిపోగానే స్థానికేతర నేతలు ఆయా నియోజకవర్గాలను వదిలివెళ్లిపోవాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు చేసింది. మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉండటంతో అధికార, విపక్ష నేతలు పలు ప్రాంతాల్లో తమ చివరి ప్రచారాలు చేసుకుంటున్నారు. వివిధ వర్గాల ప్రజలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో రేపు(బుధవారం), ఎల్లుండి(గురువారం) అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
ఈ మేరకు హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి ఎక్స్‌(ట్విట్టర్)లో ఈ విషయాన్ని వెల్లడించారు.

Also Read: కన్న కూతుళ్లపై ప్రియుడితో లైంగిక దాడి.. కసాయి తల్లికి కేరళ కోర్టు ఏ శిక్ష వేసిందటే

డిసెంబర్‌ 1న మళ్లీ విద్యాసంస్థలు యథావిధిగా ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. ఇక నవంబర్‌ 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు ఉండనుంది. అదే రోజున తెలంగాణతో పాటు మిగతా నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా జరగనుంది.

Also Read: ఎంఐఎం ఎక్కడ పోటీ చేయాలో బీజేపీ నిర్ణయిస్తోంది: రాహుల్ సంచలన వ్యాఖ్యలు..

Advertisment
తాజా కథనాలు