Teacher Cheats Student: ఏపీలో పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. విద్యాబుద్ధులు చెప్పాల్సి బడిపంతులు.. బుద్ధి తప్పి ప్రవర్తించాడు. కామంతో కళ్లు మూసుకుపోయి.. కీచకుడిలా మారాడు. తాను పాఠాలు చెబుతున్న స్కూల్ విద్యార్థినికే తాళి కట్టాడు ఉపాధ్యాయుడు. పెళ్లి అయ్యిందంటూ తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తరువాత తనకేమీ తెలియనట్లు డ్రామాలాడు. బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన పురెళ్ల సోమరాజు.. ఉండి మండలం యండగండి గ్రామంలోని పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అదే స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానంటూ తన స్వగ్రామానికి తీసుకెళ్లాడు. అక్కడే తాళి కట్టి తామిద్దరికీ పెళ్లి అయ్యిందని చెప్పాడు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: స్టూడెంట్‌కి తాళి కట్టిన టీచర్.. పైళ్లి అయిందంటూ రేప్.. కట్ చేస్తే..
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓ టీచర్.. స్టూడెంట్‌కు తాళి కట్టాడు. ఇద్దరికీ పెళ్లయ్యిందంటూ తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అపై ఏమీ తెలియనట్లు ఆమెను ఆమె ఇంటికి పంపించాడు. దీంతో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది. టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
Translate this News: