AP: ‘విద్యాకానుక’ రెడీ.. 12న పంపిణీకి ఏర్పాట్లు

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కింద ప్రతి సంవత్సరం అందిస్తున్న ఉచిత పుస్తకాలు, యూనిఫాం, బూట్ల కిట్లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్దం చేసింది

New Update
AP: ‘విద్యాకానుక’ రెడీ.. 12న పంపిణీకి ఏర్పాట్లు

Ap: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కింద ప్రతి సంవత్సరం అందిస్తున్న ఉచిత పుస్తకాలు, యూనిఫాం, బూట్ల కిట్లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. ఈ నెల 12న స్కూళ్లు తెరిచే మొదటి రోజే వాటిని అందించేందుకు సామగ్రిని మండల స్టాక్‌ పాయింట్లకు చేర్చింది.

2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి 1 నుంచి 10 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మొదటి సెమిస్టర్‌ లో బోధించే 3.12 కోట్ల పాఠ్య పుస్తకాలు మండల స్టాక్‌ పాయింట్లకు ఇప్పటికే చేరవేశారు. ఈ క్రమంలోనే విద్యార్థులకు యూనిఫాం పంపిణీ శనివారం నుంచి మొదలు కానుంది.

వస్తువులను ఒక్కొక్కటిగా స్టాక్‌ పాయింట్లకు చేర్చిన అనంతరం అక్కడ తరగతుల వారీగా కిట్లను రెడీ చేసేందుకు రెడీ అవుతున్నారు. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల మందికి కిట్లను అందించగా...ఈ ఏడాది మరో 2 లక్షల కిట్లను అదనంగా అందించడానికి అధికారులు సిద్దమయ్యారు.

Also read: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. నేడు ఆ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు!

Advertisment
తాజా కథనాలు