School Bus: తెలంగాణలో స్కూల్‌బస్సు బోల్తా.. ఎంత మంది విద్యార్థులకు గాయాలయ్యాయంటే..?

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో ఘోర పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులను తీసుకెళ్తున్న పాఠశాల బస్సు బోల్తా పడింది. దీంతో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం చేస్తున్నారు. పిల్లలకు ఏమైనా జరుగుతుందేమో అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. భారీగా ఆస్పత్రి దగ్గర చేరుకున్నారు.

School Bus: తెలంగాణలో స్కూల్‌బస్సు బోల్తా.. ఎంత మంది విద్యార్థులకు గాయాలయ్యాయంటే..?
New Update

మహబూబ్‌నగర్‌ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జడ్చర్లలో విద్యార్థులను తీసుకెళ్తున్న పాఠశాల బస్సుబోల్తా పడింది. బస్సులో ఉన్న 30 మంది విద్యార్థులు తీవ్రంగా గాయాలయ్యాయి. మౌంట్‌ బాసిల్‌ స్కూల్‌కు చెందిన బస్సు జడ్చర్ల-మహబూబ్‌నగర్‌ మార్గంలో కొత్తతండా దగ్గర అదుపుతప్పి బోల్తాపడింది. సమాచారం అందుకున్న పోలీసులు.. స్థానికులతో సహాయకచర్యలు చేపట్టారు. విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన విద్యార్థులను మొదటగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించి.. అనంతరం SVS ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆందోళనతో ఆస్పత్రి వద్దకు విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకున్నారు. కొంతమంది స్కూల్ దగ్గర నుంచి విద్యార్థులందరిని ఇంటికి తీసుకెళ్తున్నారు.

This browser does not support the video element.

లారీ బలంగా ఢీకొట్టడంతో

పోలీసుల వివరాల ప్రకారం.. స్కూల్ బస్సు బోల్తాపడి 30 మంది విద్యార్థులు గాయపడినట్లు తెలిపారు. 45 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. కొత్తతండా సమీపంలో ఉన్న మౌంట్ బాసిల్ ప్రైవేట్‌ పాఠశాలకు చెందిన 7వ నెంబర్ గల బస్సు ప్రమాదానికి గురైదయ్యారు. ఈ క్రమంలో క్రాసింగ్ దగ్గర వెనక నుంచి లారీ బలంగా ఢీకొట్టడంతో బస్సు అదుపు తప్పి డివైడర్‌కు ఢీకొట్టిందని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 44 మందికి పైగా విద్యార్థులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే 167 హైవేపై భారీగా ట్రాఫిక్ జాం అయింది.

This browser does not support the video element.

మెరుగైన వైద్య చికిత్స అందించాలని

గాయపడిన విద్యార్థులలో కొందరి విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. స్కూల్‌ బస్సు బోల్తాపడిన విషయం తెలిసిన తల్లిదండ్రులు  పాఠశాల వద్దకు భారీ సంఖ్యలో ల్లల యోగక్షేమాలు తెలుసుకున్నారు. తమ పిల్లలకు ఏం జరిగిందోనని ఆరా తీసే ప్రయత్నం చేసి టెన్షన్‌ పడ్డారు. ఈ క్రమంలో స్కూల్‌ యజమాన్యం స్కూల్ బస్సు రూట్ నెంబర్ తెలపకపోవడంతో  తల్లిదండ్రులు భయాందోళనకు గురైయ్యారు. అయితే ప్రమాదంపై అడిగితే.. యజమాన్యం దురుసుగా ప్రవర్తిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.. జిల్లా కలెక్టర్‌ ద్వారా వివరాలు అడిగి.. పరిస్థితిపై ఆరా తీశారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని డాక్టర్లకు ఎమ్మెల్యే సూచించారు. నిత్యం యూటర్న్ అనంతరం రాంగ్ రూట్‌లో బస్సు స్కూల్‌కి వెళ్తోంది. డౌన్ ఆల్, టర్నింగ్ ఉన్న జాతీయ రహదారిపై అల వెళ్ళడం సరైంది కాదని పలు మార్లు యాజమాన్యం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు చెపుతున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామంటున్న పాఠశాల యాజమాన్యం తెలిపారు.

This browser does not support the video element.

ఇది కూడా చదవండి: కొత్త స్నేహాలు ఎంతవరకు.. ఎవరిని నమ్మాలి..?

#road-accident #overturned #judchar #mahbubnagar-district #school-bus
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe