Aasara Pension: ఆసరా పెన్షన్లలో కేసీఆర్ సర్కార్ అవినీతి.. కాగ్ సంచలన రిపోర్ట్

ఆసరా పింఛన్ల పంపిణీపై కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పెన్షన్ల పంపిణీలో గోల్‌మాల్‌ జరిగిందని పెర్కొంది. 2018-21 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆడిట్ చేసిన కాగ్.. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 16 శాతం మందికి అర్హత లేకున్నా గత ప్రభుత్వం పింఛన్లు జారీ చేసిందని పేర్కొంది.

CM Jagan: పెన్షన్ రూ.5000లకు పెంపు!
New Update

CAG Report: ఆసరా పింఛన్ల పంపిణీపై కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పెన్షన్ల పంపిణీలో గోల్‌మాల్‌ జరిగిందంటూ తేల్చి చెప్పింది. 2018-21 ఆర్థిక సంవత్సరాల మధ్య కాగ్ ఆడిట్ చేసింది. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ఆసరా పింఛన్లను పంపిణీ చేశారు అని కాగ్‌ నివేదిక స్పష్టం చేసింది. ఆసరా డేటా బేస్, సమగ్ర కుటుంబ సర్వే మధ్య వ్యత్యాసం ఉందని పేర్కొంది. వినియోగించని మొత్తం బ్యాంకు ఖాతా ఉందని.. సెర్ప్‌ మాత్రం పూర్తిగా చెల్లించినట్లు నివేదిక ఇచ్చారు. 2018-21 మధ్య కాలంలో సగటున నెలకు 2.3లక్షల మందికి పింఛన్ల చెల్లింపు జరగలేదని తెలిపింది. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 16 శాతం మందికి అర్హత లేకున్నా గత ప్రభుత్వం పింఛన్లు జారీ చేసిందని పేర్కొంది.

ALSO READ: కేసీఆర్‌కు హరీష్ రావు వెన్నుపోటు.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాళేశ్వరంపై కాగ్‌ నివేదిక..

కాళేశ్వరంపై కాగ్‌ నివేదికను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. రిపోర్ట్ లో గత ప్రభుత్వ విధానాలను కాగ్ తప్పుబట్టింది. ప్రాజెక్టు వ్యయం 122 శాతం పెరిగింది.. కానీ ఆయకట్టు 52 శాతం మాత్రమే పెరిగిందని పేర్కొంది. ప్రాజెక్టు డీపీఆర్‌కు ముందు రూ.25వేల కోట్లతో ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపింది. ప్రాజెక్ట్‌ వ్యయం రూ.63వేల352 కోట్ల నుంచి రూ.లక్షా 2వేల 267 కోట్లు పెరిగిందని పేర్కొంది. ప్రాజెక్టుతో కలిగే ప్రయోజనాలను ఎక్కువ చేసి చూపించారని తేల్చి చెప్పింది.

విద్యుత్ చార్జీల కోసం రూ.10వేల 374 కోట్లు..

ఏటా విద్యుత్ చార్జీల కోసం రూ.10వేల 374 కోట్లు ఖర్చు అవుతుందని కాగ్ నోవేదిక తెలిపింది. అదనంగా నిర్వాహణ ఖర్చు రూ.272 కోట్లుగా పేర్కొంది. ప్రాజెక్టు నిర్వాహణ ఖర్చు ఏడాదికి రూ.10వేల 647 కోట్లు అని తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.81,911 కోట్లని.. ప్రాజెక్ట్ అంచనాలన్నిటికీ కలిపి ప్రభుత్వం ఓకేసారి అనుమతి ఇవ్వలేదని.. విడతల వారీగా ఒక్కో పనికీ విడివిడిగా అనుమతులు జారీ చేసినట్టు పేర్కొంది. 2022 మార్చి నాటికి మొత్తం రూ.లక్షా 10వేల 248 కోట్లు అనుమతులు ఇచ్చినట్లు తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నిధులను ఎలా సమకూర్చుకున్నారో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేవని వెల్లడించింది కాగ్.

DO WATCH:

#kcr #brs-government #telangana-pensions #cag-reports #aasara-pension
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe