ఎస్సి, ఎస్టీ, బిసి మైనారిటీ వర్గాల సలహాదారు షబ్బీర్ అలీ 6 గ్యారంటీలు 100 డేస్ రివ్యూ మీటింగ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సి, ఎస్టీ, బిసి మైనారిటీ వర్గాల సలహాదారు షబ్బీర్ అలీ గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఎస్సి, ఎస్టీ, బిసి మైనారిటీ వర్గాల డిక్లరేషన్, 6 గ్యారంటీలు 100 డేస్ లో ఎలా పూర్తి చేయాలి అనే అంశం పై రివ్యూ చేస్తున్నామని వెల్లడించారు By Nedunuri Srinivas 24 Jan 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి Shabbir Ali :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సి, ఎస్టీ, బిసి మైనారిటీ వర్గాల సలహాదారు షబ్బీర్ అలీని నియమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తూ స్టేట్ మినిస్టర్ ర్యాంకు తో కూడిన ప్రోటోకాల్ ఇచ్చిన విషయం తెలిసిందే. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో , షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ ఎస్సి, ఎస్టీ, బిసి మైనారిటీ వర్గాలను అభివృద్ధి చేసే పనిలో ఉన్నామని అన్నారు. పార్టీ పరంగా మేము, ప్రభుత్వం నుండి భట్టి విక్రమార్క పర్వవేక్షణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ తెలంగాణలోనే జనాభా 85 శాతం ఉన్నారని .. ఈ నాలుగు కులాల దగ్గరకి ఎలా పోవాలి అన్న అంశాలపై చర్చించామని అన్నారు.ఈ తరగతులను అభివృద్ధి చేయడం మా భాద్యత అని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను ఖచ్చితం గా అమలు చేసే పనిలో ఉన్నామని , రేపు ఎల్లుండి ఛార్జ్ తీసుకున్న తర్వాత వివిధ శాఖల కార్యదర్శులని పిలిచి మాట్లాడుతానని అన్నారు. ఇక.. మా నలుగురు చైర్మన్స్ అయిన ఎస్సీ డిక్లరేషన్, ఖర్గే , బీసీ డిక్లరేషన్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, మైనారిటీ డిక్లరేషన్ సల్మాన్ కుర్షీద్ లతో మేం ఇచ్చిన హామీ ల మీద చర్చించడం జరిగిందని . వాటితో సహా ఎన్నికలకు నుందు ఇచ్చిన కాంగ్రెస్ 6 గ్యారంటీలు 100 డేస్ లో ఎలా పూర్తి చేయాలి అనే అంశం పై రివ్యూ చేసుకున్నామని వెల్లడించారు. ఇక.. బడ్జెట్ లో ఏమేం పెట్టాలి… అవి అధికారులు సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా అనే విషయంపై సమీక్షిస్తానని అన్నారు. ఈ విషయాలను పార్టీ పరంగా మేము, ప్రభుత్వం నుండి భట్టి విక్రమార్క పర్వవేక్షిస్తామని తెలియజేసారు. ఆరు గ్యారెంటీల అర్హుల ఎంపిక ప్రక్రియ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన అభయహస్తం ఆరుగ్యారెంటీల అమలు వంద రోజుల్లో పూర్తి చేసే పనిలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమంలో ధరఖాస్తులు స్వీకరించడం కూడా జరిగింది. అయితే .. ఈ హామీలు ఇచ్చిన గడువులోపు పూర్తి చేయడం అసాధ్యమంటూ ఇంకా గడువు చాలా దగ్గ్గరలోనే ఉందంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ విమర్శలను ఏ మాత్రం పట్టించుకోకుండా హామీల అమలుకు ఇప్పటికే కార్యచరణ షురూ చేసింది. మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. ఇక.. చేయూత పథకంలో భాగంగా ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచింది. మిగిలిన గ్యారంటీల అమలుకు యుద్దప్రాతిపధికన పని చేస్తోంది. ఇప్పటికే దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ పూర్తయిన విషయం తెల్సిందే,తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1.25 కోట్లకు పైగా అప్లికేషన్లు రాగా , ప్రస్తుతం ఆ అఫ్లికేషన్ల ఆన్‌లైన్ ప్రక్రియ కొనసాగుతుంది. అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేపనిలో భాగంగా గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇక .. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్నట్లు కాంగ్రెస్ సర్కార్ తెలిపింది. మోడరన్ టెక్నాలజీ , సాఫ్ట్‌వేర్ సహాయంతో ఆరు గ్యారెంటీలకు అర్హుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని వెల్లడించింది. అప్లికేషన్‌లను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ). సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) పరిశీలిస్తాయని చెప్పింది. ఈ ఎంపిక ప్రక్రియ చాలా పారదర్శకంగా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు కాంగ్రెస్ వెల్లడించింది. ALSO READ : రేవంత్ రెడ్డిని కలిస్తే తప్పేంటి.. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి! #telangana #congress-party #shabbir-ali #6-guarantees-100-days-review మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి