SBI Alert: దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు దేశవ్యాప్తంగా ఖాతాదారుల సంఖ్య అధికమే. అలాగే బ్యాంకు నియమ నిబంధనలకు సంబంధించిన విషయాలను ఎస్ బీఐ ఎప్పటికప్పుడు తన వినియోగదారులకు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంది. అందుకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుపై ఖాతాదారుల్లో విశ్వాసం అధికంగా ఉంటుంది. అయితే ఈ బ్యాంకు ఆన్ లైన్ సేవలు కొన్నిగంటలు అందుబాటులో ఉండవని తెలిపింది. ఈ విషయాన్ని ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా ఖాతాదారులకు వెల్లడించింది. మెయింటెనెన్స్ కారణంగా సర్వీసులకు అంతరాయం కలుగుతున్నట్లు ఎస్బీఐ తెలిపింది.
ఖాతాదారుల అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎస్బీఐ పేర్కొంది. రేపు ఫిబ్రవరి 10 అర్థరాత్రి 12 గంటలన నుంచి తెల్లవారు జామున 3గంటల వరకు ఎస్బీఐ ఆన్ లైన్ సేవలు అందుబాటులో ఉండవు. అంటే యోనో సేవలు పనిచేయవని తెలిపింది.