Savitri Jindal: అపరకుబేరులను పక్కన కూర్చోపెట్టిన సావిత్రి జిందాల్

భారతదేశ అపరకుబేరులు అంబానీ, అదానీలను పక్కన పెట్టేసిందో మహిళ. వాళ్ళది కాదు ఈ ఏడాది సంపాదన నాదే ఎక్కువ అంటున్నారు పారిశ్రామిక వేత్త సావిత్రి జిందాల్. ప్రస్తుతం ఈవిడ సంపద విలువ 25.3 బిలియన్ డాలర్లు.

Savitri Jindal: అపరకుబేరులను పక్కన కూర్చోపెట్టిన సావిత్రి జిందాల్
New Update

Savitri Jindal: మన దేశంలో అత్యంత సంపన్నులు ఎవరిని అడిగితే చిన్నపిల్లలు కూడా టక్కుడ చెప్పే పేర్లు అంబానీ, అదానీ, టాటా, బిర్లా . చాలా ఏళ్ళ నుంచి ఈ లెగసీని కాపాడుకుంటూ వస్తున్నారు వీళ్ళు. కానీ ఈ ఏడాది మాత్రం ఒక మహిళ వీళ్లను చిత్తుగా ఓడించింది. ఆమె పేరే సావిత్రి జిందాల్‌ (Savitri Jindal). ఈ ఏడాదిలో ఎక్కువ డబ్బు సంపాదించిన వారిలో సావిత్రి టాప్‌ ప్లేస్‌లో నిలిచారు. ఈ ఒక్క సంవత్సరంలోనే ఆమె ఆస్తి 9.6 బిలియన్‌ పెరిగింది. దీంతో ఈమె మొత్తం సంపద విలువ 25.3 బిలియన్‌ డాలర్లకు చేరిందని ‘బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ (Bloomberg Billionaires Index) డేటా చెబుతోంది. 2023లో షేర్‌ మార్కెట్‌ రైజింగ్‌ కారణంగా సావిత్రి జిందాల్‌ ఆస్తిపాస్తులు అమాంతం పెరిగాయని తెలుస్తోంది. సావిత్రి జిందాల్ మరో ఘనత ఏంటంటే..మన దేశంతో పాటు, ఆసియాలోని అత్యంత సంపన్న మహిళల్లోనూఈమెదే అగ్రస్థానం. చాలా కాలంగా టాప్‌ ప్లేస్‌లోనే కొనసాగుతున్న సావిత్రి.. మొత్తం ఆసియా ఖండంలోనే మరే మహిళా దరిదాపుల్లోకి కూడా చేరలేని పొజిషన్ కు చేరుకున్నారు.

సావిత్రి జిందాల్ ఎవరు?
ఓం ప్రకాశ్‌ జిందాల్‌ (OP Jindal) భార్య సావిత్రి జిందాల్. జిందాల్ గ్రూప్ చైర్‌పర్సన్ ఆమె. భర్త మరణం తర్వాత జిందాల్‌ గ్రూప్‌ నిర్వహణ బాధ్యతలను చేతుల్లోకి తీసుకున్నారు. ఈ గ్రూప్‌లో... JSW స్టీల్‌, JSW ఎనర్జీ, జిందాల్ పవర్, జిందాల్ హోల్డింగ్స్, JSW సా, జిందాల్ స్టెయిన్‌లెస్ వంటి కంపెనీలు ఉన్నాయి.

Also Read:పన్నూ హత్య కుట్రమీద మొదటిసారి స్పందించిన భారత ప్రధాని మోదీ.

2023లో ఎక్కువ డబ్బు సంపాదించిన వారి లిస్ట్‌ను బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ డేటా రిలీజ్ చేసింది. ఇందులో HCL టెక్‌ అధినేత శివ్‌నాడార్‌ది (Shiv nadar) సెకండ్‌ ప్లేస్‌, ఈ ఏడాది ఆయన డబ్బు 8 బిలియన్‌ డాలర్లు పెరిగింది. తరువాత DLF లిమిటెడ్‌ ఛైర్మన్‌ KP సింగ్‌ ఆస్తుల విలువ 7.15 బిలియన్‌ డాలర్లు పెరిగి ఈయన థర్డ్ ప్లేస్ ను సొంతంత చేసుకున్నారు. ఇక నాల్గవ స్థానంలో ఉన్న ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా & షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌నకు చెందిన షాపూర్ మిస్త్రీ సంపద 6.5 బిలియన్ డాలర్ల చొప్పున పెరిగింది.

ఇక భారత అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) సంపద ఈ ఏడాది 5.2 బిలియన్‌ డాలర్లే పెరిగింది అంటోంది బ్లూమ్ బర్గ్. 98.2 బిలియన్ డాలర్ల ఆస్తులతో దేశంలోనే అత్యంత సంపన్నుడిగా అంబానీ కొనసాగుతున్నారు. ప్రపంచ రిచ్‌ పీపుల్‌ లిస్ట్‌లో ఈయనది 13వ స్థానం. 2023లో ఆస్తు సంపాదనలో, అంబానీ తర్వాతి స్థానాల్లో సన్‌ఫార్మా MD దిలీప్‌ సంఘ్వి, రవి జైపురియా, ఎంపీ లోథా, సునీల్‌ మిత్తల్‌ ఉన్నారు. మరోవైపు హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌తో దెబ్బతిన్న గౌతమ్‌ అదానీ ఆస్తుల విలువ 2023లో 35.4 బిలియన్‌ డాలర్లు తగ్గింది. అయినా.. మొత్తం 85.1 బిలియన్‌ డాలర్ల సంపదతో భారతదేశ సంపన్నుల్లో రెండో స్థానంలో ఉన్నారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఈ సంవత్సరం దేశంలోని టాప్-5 ధనవంతుల్లో (పురుషులు, మహిళలు కలిపి) ఒకరిగా సావిత్రి జిందాల్‌ నిలిచారు. విప్రోకు చెందిన అజీమ్ ప్రేమ్‌జీని వెనక్కి నెట్టి 5వ స్థానాన్ని ఆమె దక్కించుకున్నారు. అజీమ్ ప్రేమ్ జీ సంపద 24 బిలియన్ డాలర్లు.

#adani #mukhesh-ambani #savitri-jindal #net-worth-growth
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe