Save the Tigers Season 2: దెబ్బకు సిస్టం మారిపోవాల! నవ్విస్తున్న..సేవ్ ద టైగర్స్ సీజన్ 2 ట్రైలర్ 

సేవ్ ద టైగర్స్ సీజన్ 1 డిస్నీ హాట్ స్టార్ లో కుటుంబ ప్రేక్షకులను అలరించింది. దీనికి కొనసాగింపు సీజన్ 2 మార్చి15 నుంచి ప్రసారం కాబోతోంది. దీని ట్రైలర్ ఇప్పుడు అందర్నీ నవ్వుల్లో ముంచేస్తోంది. ఇక సీజన్ 1 అన్ని ఎపిసోడ్లు మార్చి 10 వరకూ ఫ్రీగా చూసే అవకాశం కల్పించారు.

Save the Tigers Season 2: దెబ్బకు సిస్టం మారిపోవాల! నవ్విస్తున్న..సేవ్ ద టైగర్స్ సీజన్ 2 ట్రైలర్ 
New Update

Save the Tigers Season 2: ఎప్పుడూ భార్యల మీద కంప్లైంట్ చేసేవాళ్ళు ఒక్కసారిగా మారిపోతే ఏమవుతుంది? అసలు అలా మారిపోయిన వాళ్ళుంటే కదా తెలిసేది అంటారా? ఉన్నారండీ బాబూ.. ఎక్కడంటారా.. వాళ్ళేనండీ మన సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ హీరోలు. ఏమిటి ఇంకా అర్ధం కాలేదా.. మన అభినవ్ గోమాతమ్ (Abhinav Gomatam), చైతన్య కృష్ణ, ప్రియదర్శి (Priyadarshi) ముగ్గురూ కల్సి తమ భార్యాల మీద కంప్లైంట్ చేయడానికి వెళ్లి పోలీసు స్టేషన్ లో నవ్వుల పువ్వులు పూయించారు కదా.. వాళ్ళు. అప్పుడేమో అంటే ఆ సీజన్ ఆరు ఎపిసోడ్స్ లోనూ వాళ్ళకి భార్యల మీద అన్నీ కంప్లైంట్స్. మరి ఆ సీన్ రివర్స్ అయితే.. అది సెకండ్ సీజన్ అవుతుంది. 

అవును ఇప్పుడు చెబుతున్నది సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ రెండో సీజన్  గురించి. డిస్నీ హాట్ స్టార్ (Hotstar) లో సీజన్ వన్ చేసిన హంగామా ఇంకా మనం మర్చిపోలేదు కదా. ఇదిగో రెండో సీజన్ రెడీ అయిపోయిందని చెప్పి ట్రైలర్ వదిలేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే మన హీరోలు ముగ్గురూ బుద్ధిమంతులు అయిపోయినట్టు కనిపిస్తోంది. కానీ.. మనలో మన మాట అలా ఎలా మారిపోతారండీ అసలు.. అదే డౌట్ మీకూ వస్తే ఈ ట్రైలర్ చూసేయండి ఒకసారి. 

ఈ ట్రైలర్ చూస్తుంటే రెండో సీజన్  మొదటి సీజన్ ను మించి కామెడీ పంచుతుంది అనిపిస్తోంది.  సరిగ్గా మొదటి సీజన్ ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుంచి రెండో సీజన్ ట్రైలర్ మొదలు పెట్టారు.  హంసలేఖ ఎక్కడుందో ఇప్పుడు చెప్పి ఏడవండి అంటూ  అభినవ్, చైతన్య, ప్రియదర్శిని సెల్‌లోనే పోలీసులు చితకబాదారు. మొదటి సీజన్‌లో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకున్న ప్రియదర్శి, నేను యాడికి వచ్చాను అంటూ ట్రైలర్‌ను ప్రారంభించాడు. మొదటి సీజన్‌లో లానే మందు.. హంగామా ఇందులోనూ కనిపిస్తున్నాయి.  కాకపొతే, ముగ్గురు హీరోలూ కాస్త మారిపోయినట్టు కనిపిస్తున్నారు ట్రైలర్ లో. చైతన్య అమాయకంగా కనిపించాడు. జోర్దార్ సుజాత పబ్ లో ఎంజాయ్ చేస్తోంది. అభినవ్ ఆఫీస్ అని చెప్పి వచ్చేశాడు. వీళ్లకు కొత్తగా ఇంకెవరో కలిశారండోయ్. బ్యూటీఫుల్ హీరోయిన్ సీరత్ కపూర్ సేవ్ ది టైగర్స్ సీజన్ 2లో ఎంట్రీ ఇచ్చింది. 7 ఇయర్స్ ఇచింగ్ అంటూ ఆమె అదరగొట్టేసింది. ఇక ప్రియదర్శితో చైతన్య దెబ్బకు సిస్టం మారిపోవాల  అంటూ చెప్పడం నవ్వు తెప్పించింది. 

Also Read:  ఇది వ్యూహాత్మకమే.. ఆర్జీవీ వ్యూహం ఎలా ఉందంటే.. 

ట్రైలర్ మొత్తం కడుపుబ్బా నవ్వించింది. చూస్తుంటే సీజన్ వన్ కంటే రెండో సీజన్ మరింత కామెడీతో లోడ్ అయినట్టు కనిపిస్తోంది. అన్నట్టు జబర్దస్త్ వేణు, అవినాష్, గంగవ్వ ఇలా చాలామంది ఈ ట్రైలర్ లో కనిపించారు. ఏ ఊరంతకీ పాలు తాగిస్తానని చెప్తావ్.. పిల్లోడికి పాలు ఇవ్వలేవా? అని జబర్దస్త్ సుజాత పబ్ నుంచి ఫోన్ లో ప్రియదర్శిని అడగడం భలే ఉంది. ఇలా చెప్పాలంటే ట్రైలర్ లో చాలా ఉంది. 

మరి ఇన్ని వింటే.. వెంటనే సీజన్ 2 (Save the Tigers Season 2)చూసేయాలని ఉందా? కానీ, కొన్ని రోజులు ఆగాలి. డిస్నీ హాట్ స్టార్ లో సేవ్ ద టైగర్ సీజన్ 2 మార్చి 15న మొదలవుతుంది. సేవ్ ది టైగర్స్ సీజన్ 2 కి అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం వహించారు.  మహి వి రాఘవ్, ప్రదీప్ అద్వైతం ప్రొడ్యూసర్స్. అజయ్ అరసాడ సంగీతం సమకూర్చారు.  కాగా, తేజ కాకుమాను దర్శకత్వం వహించిన సేవ్ ది టైగర్స్ మొదటి సీజన్‌ను మార్చి 10 వరకు ఉచితంగా చూసే అవకాశాన్ని OTT కంపెనీ డిస్నీ హాట్ స్టార్ అందిస్తోంది. సేవ్ ది టైగర్స్ సీజన్ 2 నేపథ్యంలో ఈమధ్య ఈ ఆఫర్‌ను ప్రకటించారు. ఈలోపు అది చూసేయండి.. ఫ్రెష్ గా సీజన్ 2 వచ్చిన వెంటనే చూసేయవచ్చు. 

#save-the-tigers #priyadarshi #disney-hot-star #ott
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe