Satyabhama Movie : 'సత్యభామ' మూవీ టీమ్ బంపర్ ఆఫర్.. వాళ్లకు ఫ్రీ టికెట్స్!

సత్యభామ మూవీ టీమ్ సినిమా రిలీజ్ కి ముందు లేడీస్ కోసం స్పెషల్ ప్రీమియర్ ని ప్లాన్ చేసింది. హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో జూన్ 5న సాయంత్రం స్పెషల్ ప్రీమియర్ షో వేయనున్నారు. ఈ షోకి సంబంధించి టికెట్స్ ఉచితంగా కావాలంటే 'షీ సేఫ్' యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

Satyabhama Movie : 'సత్యభామ' మూవీ టీమ్ బంపర్ ఆఫర్.. వాళ్లకు ఫ్రీ టికెట్స్!
New Update

Satyabhama Special Premier For Ladies : అందాల చందమామ కాజల్ అగర్వాల్ తాజాగా 'సత్యభామ' అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. క్రైం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 7 న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా మూవీ టీమ్ మహిళలకి ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

వాళ్లకు ఫ్రీ టికెట్స్...

'సత్యభామ' మూవీ టీమ్ సినిమా రిలీజ్ కి ముందు లేడీస్ కోసం స్పెషల్ ప్రీమియర్ ని ప్లాన్ చేసింది. హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో జూన్ 5న సాయంత్రం స్పెషల్ ప్రీమియర్ షో వేయనున్నారు. ఈ స్పెషల్ ప్రీమియర్ కి కాజల్ అగర్వాల్ కూడా హాజరు కానుంది. ఈ షోకి సంబంధించి టికెట్స్ ఉచితంగా కావాలంటే 'షీ సేఫ్' యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read : ఏపీ ఎమ్మెల్యే కి పవన్ మాజీ భార్య అభినందనలు.. వైరల్ అవుతున్న పోస్ట్!

థియేటర్ టికెట్ కౌంటర్ దగ్గరకు సాయంత్రం 5 గంటలకు వెళ్లి, యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నట్లు చూపించే మహిళలకు టికెట్స్ ఉచితంగా ఇస్తారని మూవీ యూనిట్ తాజాగా ప్రకటించింది. కాజల్ లేడీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాని క్షణం, గూఢచారి సినిమాలను డైరెక్ట్ చేసిన శశి కిరణ్ తిక్క తెరకెక్కించారు. గత ఏడాది 'భగవంత్ కేసరి' మూవీతో హిట్ అందుకున్న కాజల్.. ఈ సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంటోందో లేదో చూడాలి.

publive-image

#kajal-agarwal #satyabhama-movie
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి