Eluru: ఏలూరు జిల్లాలో సర్పంచుల ధర్నా..! ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద సర్పంచులు ధర్నా చేపట్టారు. రాష్టవ్య్రాప్తంగా ఉన్న సర్పంచుల సమస్యలను పరిష్కరించాలంటూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ & సర్పంచ్ ల సంఘం ఆధ్వర్యంలో నిరసన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దోచుకున్న నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. By Jyoshna Sappogula 02 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి Sarpanches Protest: ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద సర్పంచులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం దోచుకున్న 14, 15వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అండ్ సర్పంచ్ ల సంఘం ఆధ్వర్యంలో నిరసన చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించేందుకు యత్నించిన సర్పంచ్ సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రికత్త వాతవారణం నెలకొంది. Also Read: కొత్త పెళ్లి కూతుర్లూ.. ఇది మీ కోసమే.. అత్తమామలను ఫ్లాట్ చేసే చిట్కాలు! అనంతరం పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసిందని దుయ్యబట్టారు. వాళ్లకు ఉండాల్సిన హక్కుల్ని హరించడమే కాకుండా వేల కోట్ల రూపాయల సర్పంచ్ నిధుల్ని జగన్ మింగేసాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: టీడీపీలోకి కందుకూరు MLA మానుగుంట? రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల్ని అపడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సర్పంచ్ నిధుల్ని కూడా దారి మళ్లించారని మండిపడ్డారు. సర్పంచ్ ల 16 డిమాండ్లు పరిష్కరించాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడానికి వెళ్తుంటే దౌర్జన్యంగా పోలీసులు అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ భావ ప్రజా వ్యతిరేక పాలన చేసిన కేసీఆర్ పరిస్థితి చూశారుగా.. అదే గతి జగన్ కు పడుతుందని హెచ్చరించారు. ఇలాంటి ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని వ్యాఖ్యానించారు. #eluru-district #sarpanches-protest మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి