Eluru: ఏలూరు జిల్లాలో సర్పంచుల ధర్నా..!
ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద సర్పంచులు ధర్నా చేపట్టారు. రాష్టవ్య్రాప్తంగా ఉన్న సర్పంచుల సమస్యలను పరిష్కరించాలంటూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ & సర్పంచ్ ల సంఘం ఆధ్వర్యంలో నిరసన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దోచుకున్న నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.