'సారే జహాసె అచ్ఛా'.. ఈ పాట రాసిన ఇక్బాల్‌ రెండు-దేశాల సిద్ధాంతానికి బీజం వేశాడని తెలుసా?

Sir Muhammad Iqbal: 'ఇండిపెండెన్స్‌ డే'కి కౌంట్‌డౌన్‌ మొదలవడంతో స్కూల్‌, కాలేజీ పిల్లలు ఆగస్టు 15న ప్రదర్శించాల్సిన వాటిని రిహార్సల్స్ చేసుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా స్వాతంత్ర్య దినోత్సవం అంటే అందరికి గుర్తొచ్చే పాట 'సారే జహాసె అచ్ఛా'. ఈ పాట రాసిన 'సర్ మహమ్మద్ ఇక్బాల్' రెండు దేశాల సిద్ధాంతానికి బీజం వేశారు. 1922లో బ్రిటన్‌ ప్రభుత్వం ఇచ్చిన నైట్‌హుడ్‌ బిరుదును ఇక్బాల్ స్వీకరించడం అప్పట్లో సంచలనం రేపింది.

'సారే జహాసె అచ్ఛా'.. ఈ పాట రాసిన ఇక్బాల్‌ రెండు-దేశాల సిద్ధాంతానికి బీజం వేశాడని తెలుసా?
New Update

'సారే జహాసె అచ్ఛా

హిందుస్తాన్ హమారా హమారా

సారే జహాసె అచ్ఛా

హిందుస్తాన్ హమారా

హమ్ బుల్ బులే హై ఇస్‌కే,

యే గుల్ సితా హమారా హమారా

సారే జహాసె అచ్ఛా

హిందుస్తాన్ హమారా హమారా

సారే జహాసె అచ్ఛా '

ఈ పాట లేకుండా ఇండిపెండెన్స్‌ వేడుకలు జరగవు. స్కూల్‌లోనైనా.. కాలేజీలోనైనా స్వాతంత్ర్య దినోత్సవం వచ్చిందంటే దేశభక్తి పాటలు కచ్చితంగా ఉంటాయి. అందులో చాలామంది ప్రిఫర్ చేసే దేశభక్తి పాట 'సారే జహాసె అచ్ఛా హిందుస్తాన్ హమారా హమారా'. ఈ పాట పాడుతున్న వారికే కాదు.. వింటున్న వారికి కూడా దేశం పట్ల గౌరవం పెరుగుతుంది, గూస్‌బంప్స్ వస్తాయి.. మన దేశం గొప్పతనాన్ని వివరించిన పాటలు అనేకం ఉన్నా.. ఈ సాంగ్‌కి ఉన్న స్పెషాలిటీ వేరు. 20వ శతాబ్దపు గొప్ప కవులలో ఒకరైన సర్ మహమ్మద్ ఇక్బాల్ ఈ గేయాన్ని రచించారు. మనదేశం గురించి ఇంత గొప్పగా వివరించిన ఇక్బాల్‌.. తర్వాత రెండు-దేశాల సిద్దాంతానికి బీజం వేశారు.

ఇక్బాల్ (Iqbal) ఎందుకిలా మారారు?

డిసెంబర్ 29, 1930న అఖిల భారత ముస్లిం లీగ్ 25వ వార్షిక సమావేశంలో మహమ్మద్ ఇక్బాల్ (Sir Muhammad Iqbal) రెండు దేశాల సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మతాల ప్రతిపాదికన దేశం విడిపోవాలని కోరుకున్నారు. హిందూ-ముస్లింలు వేరువేరుగా ఉండాలని చెప్పారు. నిజానికి ఇక్బాల్‌ రచనలు మొదట్లో చాలా సెక్యూలర్‌గా ఉండేవి. ట్రినిటీ కాలేజ్, కేంబ్రిడ్జ్ , హైడెల్బర్గ్, మ్యూనిచ్‌లలో తత్వ శాస్త్రాన్ని చదివిన ఇక్బాల్‌.. ఆ తర్వాత న్యాయశాస్త్రం కూడా చదివారు. 1904-1910 వరకు బ్రిటన్‌లో ఉన్న ఇక్బాల్‌ ఆ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చారు. అప్పటి నుంచి ఇక్బాల్‌లో మార్పు మొదలైందంటారు విశ్లేషకులు.



ఇక్బాల్ యూటర్న్?

దేశాన్ని పరిపాలిస్తూ మన సంపదను పీల్చి పిప్పి చేసి విసురుతున్న నాటి బ్రిటన్‌ పాలకులపై మొదట్లో నిప్పులు చెరిగిన ఇక్బాల్ క్రమక్రమంగా వారి పట్ల సాఫ్ట్ కార్నర్‌ చూపించడం మొదలుపెట్టారు. 1922లో బ్రిటన్‌ (British Empire) ప్రభుత్వం ఇచ్చిన నైట్‌హుడ్‌ బిరుదును (Knighthood Award) ఇక్బాల్ స్వీకరించడం అప్పట్లో సంచలనం రేపింది. సెక్యూలర్‌ భావాజాలం నుంచి మత పరమైన ఆలోచనాలవైపు వెళ్లిన ఇక్బాల్‌ మనసు ఆఖరికి రెండు-దేశాల సిద్ధాంతానికి బీజం వేసేలా చేసింది. ఈ 'టూ నేషన్‌' థియరీని మొదట ప్రతిపాదించింది ఇక్బాలేనంటారు విశ్లేషకులు. ఆయన తర్వాతే మిగిలిన వారు రెండు-దేశాల రాగం అందుకున్నారని.. ముస్లిం లీగ్‌ ఇక్బాల్‌ స్ఫూర్తితోనే ముందుకు కదిలినట్టు చెబుతారు.

అయితే మరో వాదన కూడా గట్టిగా వినిపిస్తుంది. ఇక్బాల్‌ రెండు దేశాల సిద్ధాంతాన్ని అడగలేదని మరికొంతమంది చరిత్రకారులు చెబుతుంటారు. ఇండియాలోనే ముస్లింకు వేరుగా ఒక రాష్ట్రం లేదా ప్రాంతం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసినట్టు వాదిస్తారు. యూరోపియన్‌ ప్రజాస్వామ్యం మన దేశానికి అప్లై చేయకూడదని.. ఎందుకంటే భారత్‌ అన్నది భిన్నజాతుల దేశంగా ఇక్బాల్ చెబుతుండేవారట. ఇలా ఇక్బాల్ గురించి రెండు వివిధ రకాల వాదనలు ఉండగా.. ఆయన రాసిన 'సారే జహాసె అచ్ఛా ' మాత్రం ఎప్పటికీ ఎవర్‌గ్రీనే!

Also Read: పాలు అడిగితే ఖీర్ ఇస్తాం, కశ్మీర్ అడిగితే చీల్చివేస్తాం.. ఈ దేశభక్తి డైలాగులు వింటే గూస్ బంప్స్ పక్కా..!!

#knighthood-award #sir-muhammad-iqbal #sare-jahan-se-achha-lyrics #sare-jahan-se-achha #mohammad-iqbal #independence-day #iqbal #independenceday2023
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe