IND vs SA: చెలరేగిన సంజూ.. రాణించిన తిలక్

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ లో భాగంగా నిర్ణయాత్మక మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ కు దిగన భారత్ ప్రత్యర్థికి 297 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

New Update
IND vs SA: చెలరేగిన సంజూ.. రాణించిన తిలక్

IND vs SA: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ లో భాగంగా నిర్ణయాత్మక మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ కు దిగన భారత్ ప్రత్యర్థికి 297 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ మొదలు పెట్టిన భారత్ మొదట్లో తడబడినా సంజూ శాంసన్ (114 బంతుల్లో 108; 6ఫోర్లు, 3 సిక్సర్లు) తొలి సెంచరీని అద్భుతంగా నమోదు చేయడం, తిలక్ వర్మ (77 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1సిక్సర్) హాఫ్ సెంచరీతో రాణించడంతో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. భారత బ్యాటర్లలో రింకూసింగ్ 38, తొలి వన్డే ఆడుతున్న రజత్ పటీదార్ 22, కెప్టెన్ రాహుల్ 21 పరుగులు చేశారు. సఫారీ బౌలర్లలో బ్యూరెన్ హెండ్రిక్స్ 3, నాండ్రె బర్గర్ 2, విలియమ్స్, మల్డర్, కేశవ్ మహరాజ్ తలో వికెట్ పడగొట్టారు.

ఇది కూడా చదవండి: ద్రవిడ్‎కు జిరాక్స్ కాపీనా ఏంటి..! మిస్టర్ డిపెండబుల్ కొడుకు వీడియో వైరల్

ఆట మొదలైన కొద్ది సేపటికే ఐదో ఓవర్ లో 34 పరుగుల వద్ద సాయి రజత్ పటీదార్ ను బర్గర్ బౌల్డ్ చేశాడు. మరికాసేపటికే మంచి ఫాంలో ఉన్న సాయి సుదర్శన్ ను 49 పరుగుల వద్ద హెండ్రిక్స్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అనంతరం కెప్టెన్ రాహుల్ తిలక్ వర్మతో కలిసి ఇన్నింగ్స్ ను కాసేపు నడిపించి జట్టు స్కోరు 101 పరుగుల వద్ద ఔటయ్యాడు. 52పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడిన తర్వాత బ్యాటింగ్ కు దిగిన సంజూశాంసన్ అద్భుత ఇన్నింగ్స్ తో అలరించాడు. కీలకమైన సమయంలో సెంచరీతో జట్టును ఆదుకున్న సంజూ 46వ ఓవర్ వరకూ క్రీజులో పాతుకుపోయి వేగంగా పరుగులు రాబట్టాడు. సంజూకు తోడుగా నిలిచిన తిలక్ వర్మ కూడా హాఫ్ సెంచరీతో రాణించడం, టెయిలెండర్ల సాయంతో టీమిండియా 296 పరుగులు సాధించింది.

ఇది కూడా చదవండి: Sakshi Malik: ఇక కుస్తీ పట్టను.. సాక్షి మాలిక్ ఎమోషనల్

Advertisment
తాజా కథనాలు