IPL 2024 : ఐపీఎల్ 2024లో సంజూ శాంసన్(Sanju Samson) దుమ్మురేపుతుండు. ముచ్చటగా మూడోసారి సెంచరీతో అర్దసెంచరీతో అదరగొట్టిండు. రాజస్తాన్ కెప్టెన్(Rajasthan Captain) గా సత్తా చాటుతున్నాడు. ఐపీఎల్ 2024లో 24వ మ్యాచ్ లో గుజరాత్ పై కూడా అర్ద సెంచరీతో చెలరేగిపోయాడు. 20ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. గుజరాత్ ముందు 197 పరుగుల టార్గెట్ ఉంచింది రాజస్థాన్ రాయల్స్.
ఐపీఎల్ 2024 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), రాజస్థాన్ రాయల్స్ మైదానంలో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో సంజూ శాంసన్ కెప్టెన్ గా తన 50వ మ్యాచ్ ఆడుతుండగా... కెప్టెన్ గా తన 50వ మ్యాచ్ లో ఫోర్లు, సిక్సర్లు కొడుతూ మరో అర్థ సెంచరీ చేశాడు. అలాగే, యుజ్వేంద్ర చాహల్ కూడా తన 150వ మ్యాచ్ ను ఆడుతున్నాడు. ఐపీఎల్ 2024 24వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ కు దిగింది. రాజస్థాన్ కెప్టెన్‌గా సంజూ శాంసన్ తన 50వ ఐపీఎల్ మ్యాచ్‌ను ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. సంజు సాసన్ రెండు అర్ధ సెంచరీలతో 178 పరుగులు చేసి.. అత్యధిక స్కోరు 82 పరుగులు నాటౌట్ గా నిలిచాడు. ఇక ఐదో మ్యాచ్ లో మరో హాఫ్ సెంచరీ కొట్టాడు. సంజూ శాంసన్ 38 బంతులో 68 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో చెలరేగాడు. మరో ఎండ్ లో రియాన్ పరాగ్ 76 పరుగులతో దుమ్మురేపాడు.
టీ20లలో రాజస్థాన్ తరఫున అత్యధిక 50ప్లస్ స్కోర్లు సాధించిన ప్లేయర్లు వీరే:
25 - సంజు శాంసన్ (131 ఇన్నింగ్స్ లు)
24 - జోస్ బట్లర్ (76 ఇన్నింగ్స్ లు)
23 - అజింక్య రహానే (99 ఇన్నింగ్స్ లు)
16 - షేన్ వాట్సన్ (81 ఇన్నింగ్స్ లు)
9 - యశస్వి జైస్వాల్ (42 ఇన్నింగ్స్ లు)
కెప్టెన్‌గా 50వ ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్లు చేసిన ప్లేయర్లు వీరే:
68 (38) - సంజు శాంసన్ (రాజస్తాన్ vs గుజరాత్, 2024)
65 (48) - రోహిత్ శర్మ(Rohit Sharma) (ముంబయి vs ఢిల్లీ, 2016)
45 (33) - డేవిడ్ వార్నర్ (హైదరాబాద్ vs ఢిల్లీ, 2021)
59 (46) - గౌతమ్ గంభీర్ (కోల్ కతా vs బెంగళూరు, 2013)
ఇది కూడా చదవండి: వన్ ప్లస్ కు షాకిచ్చిన రిటైల్ చైన్స్..మే 1 నుంచి విక్రయాలు నిలిపివేత.!