Sania Mirza: క్రికెటర్‌ షమితో సానియా మీర్జా పెళ్లి..అసలు విషయం ఏంటంటే!

భారత క్రికెటర్ మహ్మద్‌ షమీ కూడా తన భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. దీంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీని గురించి సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్‌ మీర్జా స్పందించారు..వారిద్దరూ ఎప్పుడూ కలవలేదని, ఇదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు.

New Update
Sania Mirza: క్రికెటర్‌ షమితో సానియా మీర్జా పెళ్లి..అసలు విషయం ఏంటంటే!

Sania Mirza: హైదరాబాద్‌ టెన్నిస్ స్టార్‌ సానియా మీర్జా కొంతకాలం క్రితం తన భర్త షోయాబ్‌ మాలిక్‌ కి విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం తన కుమారుడితో కలిసి తల్లిగారింట్లోనే ఉంటుంది. అలాగే భారత క్రికెటర్ మహ్మద్‌ షమీ కూడా తన భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. దీంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

దీంతో అటు సానియా అభిమానులు, షమీ అభిమానులు ఈ వార్త నిజమా కాదా అని నెట్టింట తెగ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఇవి సానియా తండ్రి ఇమ్రాన్‌ మీర్జా కంటపడ్డాయి. వీటి గురించి ఆయన స్పందించారు. ఇవన్నీ కూడా చెత్త వార్తలని..ఇప్పటి వరకు షమీని, సానియా కలవనేలేదని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం సానియా హ‌జ్ యాత్రకు వెళ్లింది. సానియా ఇటీవలే ప్రొఫెషనల్ టెన్నిస్‌ నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. తన ప్రార్థనలన్నింటినీ అల్లా వింటున్నాడని ఆమె అన్నారు. తాను చాలా అదృష్ట‌వంతురాలిని అని, ఎల్లప్పుడూ కూడా కృత‌జ్ఞ‌తో ఉంటాన‌ని, ప‌విత్ర యాత్ర చేప‌డుతున్న సంద‌ర్భంగా త‌న‌ను అందరూ గుర్తుంచుకోవాల‌ని, ఒక మంచి మనిషిలా తాను తిరిగి వ‌స్తాన‌ని ఆశిస్తున్న‌ట్లు సానియా త‌న పోస్టులో పేర్కొంది.

Also read: భారతీయ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌..గ్రీన్‌ కార్డు ఇస్తానని ట్రంప్‌ హామీ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు