Sania: మాలిక్ ఎఫైర్స్ పై సానియా ఫైర్.. ఆ ఫొటోలన్నీ డిలిట్!

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ల విడాకుల వార్తలు మరోసారి వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా అకౌంట్స్ లో భర్త మాలిక్ ఫొటోలన్నీ సానియా డిలిట్ చేయడం ఇందుకు కారణం. కాగా ఆయేషాతో షోయబ్ అక్రమ సంబంధం ఇష్యూ మరోసారి చర్చనీయాంశమైంది.

Sania: మాలిక్ ఎఫైర్స్ పై సానియా ఫైర్.. ఆ ఫొటోలన్నీ డిలిట్!
New Update

Sania Mirza: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా – పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ (Sania Mirza-Shoib Malik) జోడి మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో మాలిక్.. సినీ నటితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. కాగా దీంతో మాలిక్, సానియాల మధ్య గొడవలు మొదలయ్యాయని, సానియా విడాకులకు (divorce) రెడీ అయిందంటూ పెద్ద ఎత్తున పుకార్లు పుట్టుకొచ్చాయి. కానీ వీటన్నింటిని ఖండించిన సానియా.. తాజాగా భర్త ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి డిలిట్ (Delet) చేయడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

షోయబ్ ఫొటోలు డిలిట్..
ఈ మేరకు కొంతకాలంగా పాకిస్థాన్ వెళ్లకుండా ఇండియాలోనే ఉంటున్న సానియా.. రీసెంట్ గా ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ నుంచి భర్త షోయబ్ తో కలసి ఉన్న ఫొటోలను డిలిట్ చేసింది. చివరిసారిగా కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్ లో కలసి కనిపించిన జోడీ.. మళ్లీ ఎన్నడూ కలిసినట్లు ఆధారాలు లేవు. అంతేకాదు అప్పటినుంచి ఇరువురు ఎలాంటి అప్ డేట్, ఫొటోలు షేర్ చేయలేదు. ఈ క్రమంలోనే సానియా ఈ నిర్ణయం తీసుకోవడంపై అందరికీ అనుమానం మొదలైంది. ఇద్దరి మధ్య రిలేషన్ దెబ్బతిన్నదని, అందుకే సోషల్ మీడియాలో ఫొటోలు డిలిట్ చేశారని నెటిజన్స్ బలంగా వాదిస్తున్నారు. అంతేకాదు ఈ జోడీ తొందరలోనే విడాకులు తీసుకుంటారంటూ రకరకాలుగా చర్చిస్తున్నారు.

ఇది కూడా చదవండి : Indian Air Force : భారత అమ్ములపొదిలో మరో అద్భుత అస్త్రం

మాలిక్ లేషన్ షిప్ స్టేటస్..
ఇదిలా ఉంటే.. గతంలో షోయబ్ కూడా తన ట్విట్టర్ అకౌంట్ లో రిలేషన్ షిప్ స్టేటస్ నుంచి సానియా మీర్జా పేరు తొలగించాడు. ఆ తర్వాత తాను సూపర్ ఉమెన్ సానియా మీర్జా భర్తను అని గర్వంగా చెప్పుకుంటూ స్టేటస్ పెట్టాడు. కొన్నాళ్లకు ఇన్ స్టాలో ఆమె ఫొటోలు డిలిట్ చేసిన ఆయన మళ్లీ ఎలాంటి పోస్ట్ పెట్టకపోవడం విశేషం. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త వైరల్ అవుతోంది.

ఆయేషాతో అక్రమ సంబంధం..
ఇక మాలిక్ అక్రమ సంబంధం విషయానికొస్తే.. పాకిస్తాన్ నటి, మోడల్ ఆయేషా ఓమర్ (Ayesha Omar)తో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు మీడియాలో వార్తలొచ్చాయి. వీరిద్దరూ స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు సైతం వైరల్ అయ్యాయి. దీంతో షోయబ్, సానియాల మధ్య బంధం చెడిపోయిందంటూ పెద్ద ఎత్తున వార్తలు వెలువడ్డాయి. కానీ ఆయేషా మాత్రం అవన్నీ పుకార్లే అనీ కొట్టిపారేసింది. పెళ్లి అయిన వ్యక్తితో ఎలా సంబంధం పెట్టుకుంటానని ప్రశ్నించింది. ఆ ఫొటోలు ఓ షూట్ సందర్భంగా దిగినట్టు వివరణ ఇచ్చింది. ఏది ఏమైనా షోయబ్, సానియాల విడాకుల ఇష్యూ మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఎవరూ క్లారిటీ ఇస్తారోనని జనాల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇక మాలిక్ ను ప్రేమించి 2010లో సానియా మీర్జా పెళ్లాడగా వీళ్లకు ఇజాజ్ అనే కొడుకు ఉన్నాడు.

#divorce #sania-mirza #shoaib-malik
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe