Hyderabad: ఈఎస్ఐ ఆస్పత్రిలో దారుణం..యువతిపై లిఫ్ట్‌లో అత్యాచారం

సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. హాస్పిటల్ లిఫ్ట్‌లో యువతిని భవనంపై అంతస్తు తీసుకెళ్ళి నోట్లో గుడ్డలు కుక్కి ఓ యువతిపై అత్యాచారం చేశాడు లిఫ్ట్ ఆపరేటర్. డైట్ సెక్షన్‌ ఫ్లోర్‌లో ఘటన జరిగింది.

Hyderabad: ఈఎస్ఐ ఆస్పత్రిలో దారుణం..యువతిపై లిఫ్ట్‌లో అత్యాచారం
New Update

హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. హాస్పిటల్ లిఫ్ట్‌లో యువతిని భవనంపై అంతస్తు తీసుకెళ్ళి నోట్లో గుడ్డలు కుక్కి ఓ యువతిపై అత్యాచారం చేసిన లిఫ్ట్ ఆపరేటర్. డైట్ సెక్షన్‌లో ఫ్లోర్‌లో ఘటన జరిగింది.

హైదరాబాద్‌ సనత్‌నగర్‌ ESI ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఓ యువతిపై అత్యాచారానికి తెగబడ్డాడు క్యాంటీన్‌ బాయ్‌. నోట్లో గుడ్డలు కుక్కి ఆమెపై పైశాచికత్వం ప్రదర్శించాడు. కర్ణాటకకు చెందిన యువతి సోదరుడు జారి పడటంతో తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఈఎస్‌ఐ ఆస్పత్రిలోని PMR వార్డులో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నాడు. సోదరి దగ్గరుండి అతన్ని చూసుకుంటోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి భోజనం కోసం ఆరో అంతస్తు నుంచి కిందికొచ్చింది.

డైట్‌ సెక్షన్‌లో ఘటన

ఆ సమయంలో ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు క్యాంటీన్‌ బాయ్‌. అతని వెకిలిచేష్టలకు విసిగిపోయిన యువతి.. గట్టిగా అరుస్తానని బెదిరించడంతో.. ఆమెనుపై ఫ్లోర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ డైట్‌ సెక్షన్‌లో ఆమెపై అత్యాచారం  చేశాడు. అక్కడ నుంచి తప్పించుకున్న ఎస్ఆర్ నగర్ పీఎస్‌లో యువతీ ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితున్ని అదుపులోకి దర్యాప్తు చేస్తున్నారు.  యువతీపై అత్యాచారం అయినట్టు ఈఎస్ఐ ఆస్పత్రి డాక్టర్లు నిర్ధారించారు.

#hyderabad #girl-was-raped #sanatnagar #esi-hospital #in-the-lift
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe