రైలులో భయానక ఘటన.. శవంతో 600 కిలోమీటర్ల ప్రయాణం

తమిళనాడు సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో భయానక ఘటన చోటుచేసుకుంది. దాదాపు 600 వందల కిలోమీటర్లు డెడ్ బాడీతోనే ప్యాసింజర్లు ప్రయాణించారు. రైల్వే అధికారులకు సమాచారం అందించినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురైనట్లు చెబుతూ ఆందోళన వ్యక్తం చేశారు.

రైలులో భయానక ఘటన.. శవంతో 600 కిలోమీటర్ల ప్రయాణం
New Update

తమిళనాడు సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో భయానక ఘటన చోటుచేసుకుంది. దాదాపు 600 వందల కిలోమీటర్లు డెడ్ బాడీతోనే ప్యాసింజర్లు ప్రయాణించారు. రైల్వే అధికారులకు సమాచారం అందించినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురైనట్లు చెబుతూ ఆందోళన వ్యక్తం చేశారు.

విషయానికొస్తే.. యూపీలోని బండా జిల్లాకి చెందిన 36 ఏళ్ల రామ్‌జీత్ యాదవ్‌ అనే వ్యక్తి చెన్నైలో పని చేస్తున్నాడు. అయితే కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్ జీత్.. చెన్నై నుంచి హజ్రత్ నిజాముద్దీన్‌కి వెళ్తున్న రైల్ లో తన స్వగ్రామానికి బయలుదేరాడు. సరిగ్గా ట్రైన్ నాగ్ పూర్ కు చేరుకునే సమయానికి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. అయితే అదే బోగీలో ప్రయాణిస్తున్న వారంతా ఒక్కసారిగా కంగు తిన్నారు. అతనికి ఏమైందో, ఏం చేయాలో అర్థంకాక చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే అతని పల్స్ పడిపోవడంతో జనరల్ బోగీలోనే రామ్ జీత్ మరణించాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో దాదాపు 600 కిలోమీటర్ల వరకూ ఆ డెడ్‌బాడీతోనే ప్రయాణించారు.

Also Read: ఏం చేస్తున్నార్రా మీరు అసలు..ఇంతకంటే దరిద్రం ఉంటుందా !

ఇక ఆ బోగీలో ప్రయాణించిన వారి వివరాల ప్రకారం.. భోపాల్‌కి చేరుకునే సమయానికే రైల్వే అధికారులకు ప్రయాణికులు సమాచారం అందించినట్లు తెలిపారు. ఆ డెడ్‌బాడీని తీసుకెళ్లాలని చాలా మంది రిక్వెస్ట్ చేశామని, కానీ రైల్వే అధికారులెవరూ పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. చివరగా యూపీలోని ఝాన్సీ రైల్వే స్టేషన్‌కి వచ్చాకే ఆ మృతదేహాన్ని రైల్లో నుంచి దింపినట్లు చెప్పారు. అప్పటి వరకూ అలా శవంతోనే ప్రయాణం చేసిన ప్యాసింజర్స్.. జీవితంలో ఇలాంటి భయనక ఘటన చూడలేదని, రైల్వే అధికారుల నిర్లక్ష్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా రైల్వే అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

#sampark-kranti-express #600-km-journey #with-dead-body
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe