కొత్త లుక్‌ లో సామ్‌!

తాజాగా సమంత కొన్ని చిత్రాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. వాటిలో సమంత కొత్త లుక్‌ లో చాలా డిఫరెంట్‌ గా కనిపిస్తోంది. జుట్టు కట్‌ చేయించుకుని బీచ్‌ వద్ద నుంచుని ప్రకృతిని ఆరాధిస్తున్న ఫోటోని సామ్‌ పోస్ట్‌ చేశారు.

కొత్త లుక్‌ లో సామ్‌!
New Update

సినిమాలకు బ్రేక్‌ ఇస్తున్నాని చెప్పి అందరికీ షాక్‌ ఇచ్చింది స్టార్‌ హీరోయిన్‌ సమంత. ఈ క్రమంలోనే ఆమె ధ్యానంలో పాల్గొన్న ఫోటోలను కొన్నింటిని అభిమానులతో పంచుకుంది. గత కొంత కాలంగా మయోసైటిస్‌ తో బాధపడుతున్న సామ్‌..దానికి చికిత్స తీసుకోవడానికి మూవీస్‌ కి బ్రేక్‌ తీసుకుంది అనుకున్నారు.

samnata in new look

కానీ సమంత ఈ బ్రేక్‌ ని ఫుల్‌ గా ఎంజాయ్‌ చేస్తున్నట్లు కనిపిస్తుంది. తాజాగా సమంత కొన్ని చిత్రాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. వాటిలో సమంత కొత్త లుక్‌ లో చాలా డిఫరెంట్‌ గా కనిపిస్తోంది. జుట్టు కట్‌ చేయించుకుని బీచ్‌ వద్ద నుంచుని ప్రకృతిని ఆరాధిస్తున్న ఫోటోని సామ్‌ పోస్ట్‌ చేశారు.

సామ్‌ పోస్ట్‌ చేసిన ఇన్‌ స్టా వీడియోలో అందంగా నవ్వుతూ కనిపిస్తుంది. దానిని చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. చాలా మంది కామెంట్స్‌ కూడా చేస్తున్నారు. ఆమె ఎంత అందంగా ఉంటుందో..ఆమె మనసు కూడా అంతే అందంగా ఉంటుందని ఓ యూజర్‌ కామెంట్‌ చేశారు. ఎన్ని కష్టాలు వచ్చిన సమంత నవ్వుతుందని ఆమె గ్రేట్‌ అంటూ రాసుకొచ్చారు.

#samantha #movies #new-look #hair-cut
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe