BREAKING : జగన్‌కు మరో బిగ్‌ షాక్‌.. సమ్మెకు 108, 104 సిబ్బంది! ఎప్పటినుంచంటే?

ఏపీ ప్రభుత్వానికి మరో బిగ్‌షాక్‌ తగిలింది. ఈ నెల(జనవరి) 23 నుంచి 108, 104 సిబ్బంది సమ్మెకు వెళ్లనున్నారు. అప్కాస్‌లో తమను తీసుకోవాలన్నది వారి ప్రధాన డిమాండ్‌. 104ని హెల్త్ సెంటర్‌కి అప్పగించడం ద్వారా సంవత్సరానికి 100 కోట్లు ఆదా అవుతుందని సిబ్బంది చెబుతున్నారు.

BREAKING : జగన్‌కు మరో బిగ్‌ షాక్‌.. సమ్మెకు 108, 104 సిబ్బంది! ఎప్పటినుంచంటే?
New Update

Shock To Jagan : ఇప్పటికే సమ్మెలో ఉన్న అంగన్వాడీ లు, మునిసిపల్ కార్మికులు, SSA సిబ్బంది డిమాండ్లతో తలలు పట్టుకుంటున్న వైసీపీ(YCP) సర్కార్‌కు మరో బిగ్‌షాక్‌ తగిలింది. ఈ నెల(జనవరి) 23 నుంచి 108, 104 సిబ్బంది సమ్మెకు వెళ్లనున్నారు.

అప్కాస్ లో తీసుకోవాలి:
ఈ రోజు ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇవ్వనున్నారు 108, 104 సిబ్బంది. అప్కాస్‌(APKAS) లో తమను తీసుకోవాలన్నది వారి ప్రధాన డిమాండ్‌గా తెలుస్తోంది. ఆర్థిక పరమైన అంశాలు డిమాండ్‌గా కాకుండా డిపార్ట్మెంట్ అంశాలపై సమ్మెకు వెళ్లనున్నారు. 104ని హెల్త్ సెంటర్‌కి అప్పగించడం ద్వారా సంవత్సరానికి 100 కోట్లు ఆదా అవుతుందని సిబ్బంది చెబుతున్నారు. 108, 104ను అరబిందో సంస్థ నిర్వహిస్తున్న విషయంత తెలిసిందే. 108, 104లో 18 ఏళ్లుగా పని చేస్తున్న వాళ్ళను RTC కాంట్రాక్టు డైవర్స్ గా తీసుకోవాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.

తొలిసారి ఏపీలోనే:
దేశంలో 108 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీస్ అనేది ఒక ఉచిత అత్యవసర సేవ. ఇది అవసరమైన ప్రజలకు రవాణా మరియు వైద్య సంరక్షణను అందిస్తుంది. 24 గంటలూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. కాల్ వచ్చినప్పుడు, దగ్గరలో అందుబాటులో ఉన్న అంబులెన్స్(Ambulance) కాల్ చేసిన ప్రదేశానికి పంపుతారు. అంబులెన్స్ సిబ్బందిలో డ్రైవర్, పారామెడికల్, డాక్టర్ లేదా నర్సు ఉంటారు. పారామెడికల్ ప్రాథమిక జీవిత మద్దతును అందించడానికి శిక్షణ పొందుతారు. డాక్టర్ లేదా నర్సు అధునాతన జీవిత మద్దతును అందించడానికి శిక్షణ పొందుతారు. అంబులెన్స్‌లో డీఫిబ్రిలేటర్, ఆక్సిజన్ సిలిండర్, ఫస్ట్ ఎయిడ్ కిట్(First Aid Kit) వంటి అవసరమైన వైద్య పరికరాలు ఉన్నాయి. ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ - ఈఎంఆర్‌ఐ(EMRI) సహకారంతో 108 అంబులెన్స్ సేవలను తొలిసారిగా 2005 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) లో ప్రారంభించారు. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు ఈ సేవలు విస్తరించాయి. జీపీఎస్ ట్రాకింగ్, వీడియో కాన్ఫరెన్సింగ్, మొబైల్ మెడికల్ యూనిట్లు లాంటి ఆవిష్కరణలను చేర్చడానికి ఈ సేవ కాలక్రమేణా అభివృద్ధి చెందింది.

Also Read: అభిమాని చెంప చెల్లుమనిపించిన స్టార్‌ ఆల్‌రౌండర్‌.. బుద్ధి మారదుగా.. వీడియో వైరల్!

WATCH:

#andhra-pradesh #emergency #108-ambulance #ap-politics
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి