Same Sex Marriage : స్వలింగ వివాహాలపై సుప్రీం తీర్పు..అసలు హిందూ మ్యారేజ్ యాక్ట్‎లో ఏముంది?

ప్రపంచవ్యాప్తంగా స్వలింగ సంపర్కుల వివాహంపై చాలా దేశాలు చట్టబద్దతను కల్పించాయి. వాటిలో దాదాపు 30కిపైగా దేశాల్లో అమల్లో ఉంది. భారత్ లో కూడా స్వలింగ వివాహాలపై చట్టబద్దత కల్పించే విషయంపై సుప్రీంకోర్టు గత ఐదు నెలల క్రితమే వాదనలు జరిపింది. 5 నెలల నుంచి సుదీర్ఘ వాదనల తర్వాత ధర్మాసనం తీర్పును వెలువరించింది. భారతదేశంలో స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాలు ఉన్న ఈ కేసులో మంగళవారం ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తన తీర్పును వెలువరించింది. స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్దం చేసేందుకు సుప్రీంకోర్టు ఎందుకు నిరాకరించింది? అసలు హిందూ వివాహ చట్టం ఏం చెబుతోంది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Year Ender 2023: ఈ ఏడాది సుప్రీంకోర్టు తీసుకున్నఈ చారిత్రాత్మక నిర్ణయాలు..అందరి దృష్టిని ఆకర్షించాయి..అవేవంటే..!!
New Update

స్వలింగ సంపర్కుల వివాహం అంటే ఒకే లింగానికి చెందినవారు. ఇద్దరు స్త్రీలు కానీ, ఇద్దరు పురుషులు కానీ సహజీవనం చేస్తే వారిని స్వలింగ సంపర్కులు అని అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ స్వలింగ సంపర్కుల వివాహంపై చాలా దేశాలు చట్టబద్దత కల్పించాయి. ఇప్పటికీ 30కిపైగా దేశాల్లో అమల్లో ఉంది. భారత్ లో కూడా స్వలింగ వివాహాలకు చట్టబద్దత కల్పించే విషయంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో గత ఐదు నెలల నుంచి వాదనలు జరుగుతున్నాయి. సుదీర్ఘ వాదనల తర్వాత కోర్టు తీర్పును మే 11కు రిజర్వ్ చేసింది. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపును కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, రవీంద్ర భట్, హిమాకోహ్లీ, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం..తాము ప్రత్యేక వివాహచట్టం, విదేశీ వివాహ చట్టంలోని చట్టపరమైన అంశాలను మాత్రమే పరిగణలోనికి తీసుకుంటున్నామని తెలిపింది.

149ఏళ్ల క్రితమే భారత్ లో స్వలింగ సంపర్కుల చర్చ:
స్వలింగ సంపర్కుల వివాహంపై చర్చ ఇప్పటిది కాదు. 149ఏళ్ల క్రితం బ్రిటీష్ పాలనలో 1860వ సంవత్సరంలో స్వలింగ సంపర్కానికి సంబంధించి ఐపీసీ 377సెక్షన్ భారత శిక్షాస్మృతిలో ప్రవేశపెట్టారు. తర్వాత 1861 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అప్పుడు న్యాయస్థానం కీలకమైన తీర్పును వెలువరించింది. ప్రకృతికి విరుద్ధంగా ఇద్దరు పురుషుల కానీ, స్త్రీలు కానీ లైంగికంగా సహజీవనం చేస్తే వారికి జీవిత కాల శిక్షార్హులని ఆదేశాలు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: ఎన్నికల్లో మాకు మద్దతివ్వాలని పవన్‌ కళ్యాణ్‌ను కోరిన కిషన్ రెడ్డి, లక్ష్మణ్..

భారత్‎లో తొలి విచారణ:
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్వలింగ సంపర్కులపై తొలిసారిగా పిల్ ను 2001లో స్వలింగసంపర్కాన్ని చట్టబద్దం చేయాలంటూ ఎన్ఏజడ్ నాజ్ ఫౌండేషన్ ప్రజాప్రయోజన వ్యాజ్యం పిల్ దాఖలు చేసింది. 2004 సెప్టెంబర్ 2న ఢిల్లీ హైకోర్టు స్వలింగసంపర్కాన్ని చట్టబద్దం చేయాలంటూ పిల్‎ను డిస్మిస్ చేసింది. 2009లో ఢిల్లీ హైకోర్టు ఇది నేరం కాదంటూ ఇచ్చిన తీర్పును 2013లో సుప్రీంకోర్టు నేరమేనని తేల్చిచెప్పింది. ఈవిధంగా ప్రతిఏడాది పిల్‎పై ఏదొక విచారణ జరగడం...దాన్ని న్యాయస్థానం కొట్టివేయడం జరుగుతూనే ఉంది. 2009 తర్వాత నేటికీ ఈ పిల్‎పై పూర్తిగా స్వలింగ సంపర్కుల వివాహం వారికి అనుకూలంగా ఒకసారి కూడా తీర్పు వెలువరించలేదు కోర్టు.

అసలు ఈ ప్రత్యేక వివాహ చట్టం ఏమిటి?
రెండు వేర్వేరు మతాలు లేదా కులాల వారు పెళ్లి చేసుకునేందుకు వీలుగా 1954లో ప్రత్యేక వివాహ చట్టాన్ని రూపొందించింది. భారత్‎లో వివాహం తర్వాతా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. వివిధ మతాలకు వారి స్వంత చట్టాలు ఉన్నాయి. అవి ఆ మతాలను అనుసరించేవారికి మాత్రమే వర్తిస్తాయి. ఉదాహరణకు హిందూ వ్యక్తిగత చట్టం హిందూవులకు మాత్రమే వర్తిస్తుంది. భార్యభర్త ఇద్దరూ హిందువులు అయితేనే ఈ చట్టం వర్తిస్తుంది. కానీ ప్రత్యేక వివాహ చట్టం అన్ని మతాలకు వర్తిస్తుంది. అది హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్, జైన, బౌద్ధ లేదా మరే ఇతర మతమైనా...ఈ చట్టం ప్రకారం వివాహాన్ని నమోదు చేసుకోవడానికి మతం మారాల్సిన అవసరం లేదు. ఈ చట్టం ద్వారా దేశంలోప్రతిపౌరుడు వారు కోరుకున్న మతం లేదా కులంలో వివాహం చేసుకునేందుకు రాజ్యాంగ హక్కును కల్పించారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ కోసం బీజేపీ వెయిటింగ్? సీక్రెట్ ఇదేనా!

1954 ప్రత్యేక వివాహ చట్టం, 1955 హిందూ వివాహ చట్టం, 1955లోని ప్రత్యేక వివాహాల నిబంధనలను సవాలు చేస్తూ వివిధ స్వలింగ జంటలు, LGBTQ+ కార్యకర్తలు, లింగమార్పిడి వ్యక్తులు దాఖలు చేసిన 20 పిటిషన్లను విచారించిన తర్వాత ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ ఈ విధంగా తీర్పును వెలువరించింది. విదేశీ వివాహ చట్టం, చట్టంలోని నిబంధనలను సవాలు చేశారు. 1969 వివాహ చట్టం, ఇది భిన్న లింగ వివాహాలను గుర్తించడానికి ప్రయత్నిస్తుంది.

భారత్‎లో ఈ చట్టం లేనప్పటికీ ఈ తరహాలో పెళ్లి చేసుకున్న భారతీయులు:
నేటికాలంలో స్వలింగ సంపర్కం అంటే చాలా సాధారణమైంది. ఇంతకుముందు దీన్ని నేరంగా చూసేవారు. కానీ ఇప్పుడు వారి మనసులను పెద్దలు అర్థం చేసుకుంటున్నారు. ఈ మధ్యే హైదరాబాద్ లో ఇద్దరు అబ్బాయిలకు కుటుంబ సభ్యులు వివాహం చేశారు. ఇలా దేశవ్యాప్తంగా ఎంతో మంది పెళ్లిళ్లు చేసుకున్నారు.

#marriage #homosexual #same-sex-marriage #same-sex
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe