Samantha Shocking Reply : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 'ఏమాయ చేశావే' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సామ్ తన నటన, అభినయంతో అందరినీ మాయ చేసేసింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో వరుస చిత్రాలతో బిజీ అయిపోయిన సామ్.. ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సామ్.. 2018లో స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్యను వివాహం చేసుకోవడం.. ఆ తర్వాత 2021లో పలు వ్యక్తిగత కారణాలతో ఇద్దరు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే .
Also Read : Sahakutumbhanaam: రొటీన్‌కు బిన్నంగా ‘సకుటుంబానాం’.. ఫస్ట్ లుక్ పోస్టర్
సామ్, చైతన్య విడాకులు
అయితే తాజాగా సామ్, చైతన్య విడాకులకు సంబంధించి ఓ నెటిజన్ అడిగిన ప్రశ్న.. ఆమె చెప్పిన సమాధానం నెట్టింట వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో తరచూ యాక్టీవ్ గా కనిపించే సామ్.. అప్పుడప్పుడు అభిమానులతో తన హెల్త్, సినిమాలకు సంబందించిన విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు.
నెటిజన్ కు సామ్ స్ట్రాంగ్ రిప్లై
ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ సమంత చేసిన ఇన్‌స్టా పోస్ట్ కింద "మీ అమాయకపు భర్తని ఎందుకు మోసం చేసారు?”అని కామెంట్ చేశాడు. దీనికి సామ్.. క్షమించండి , ఇలాంటివి మీకు సహాయపడకపోవచ్చు..ఇంకా గొప్ప విషయాలపై దృష్టి పెట్టండి. మీకు నా బెస్ట్ విషెస్ అని రిప్లై ఇచ్చారు.
Also Read : Sahakutumbhanaam: రొటీన్‌కు బిన్నంగా ‘సకుటుంబానాం’.. ఫస్ట్ లుక్ పోస్టర్