Samantha : సమంతను నిలదీసిన నెటిజన్.. తెలియక తప్పులు చేశా అంటూ ఒప్పేసుకున్న హీరోయిన్! సమంత తాజాగా తన ఫిట్‌నెస్ ట్రైనర్ అల్కేష్ షరోత్రితో కలిసి ‘టేక్ 20’ పేరుతో ఇన్‌స్టా వేదికగా ఆరోగ్య సూత్రాలను పంచుకుంది. ఈ టిప్స్‌పై ఓ నెటిజన్ తంలో మీరు అనారోగ్యమైన బ్రాండ్లను ప్రమోట్ చేశారు కదా అని అడిగాడు. అవి తెలియక చేసిన తప్పులు అని సామ్ బదులిచ్చింది. By Anil Kumar 30 Jun 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Samantha Reply To Netizen's Question : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు గ్యాప్ ఇచ్చినా సోషల్ మీడియా ద్వారా నిత్యం ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది. నిత్యం ఏదో ఒక పోస్ట్ తో సందడి చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఫ్యాన్స్ తో చిట్ చాట్ కూడా చేస్తుంది. ఇవే కాకుండా ఇన్ స్టాగ్రామ్ ద్వారా కొన్ని బ్రాండ్స్ ను ప్రమోట్ చేసే సామ్.. తన ఫిట్‌నెస్ ట్రైనర్ అల్కేష్ షరోత్రితో కలిసి ‘టేక్ 20’ (Take20) పేరుతో ఇన్‌స్టా వేదికగా ఆరోగ్య సూత్రాలను పంచుకుంది. ఇందులో భాగంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని (Healthy Food) కూడా ప్రమోట్‌చేస్తోంది. అయితే సమంత టిప్స్‌పై ఓ నెటిజన్ క్వశ్చన్ చేశాడు. ‘ఇప్పుడీ సూక్తులు చెబుతున్నారు బాగానే వుంది. గతంలో మీరు అనారోగ్యమైన బ్రాండ్లను ప్రమోట్ చేశారు. దానికేం సమాధానం చెబుతారు?’ అని అడిగాడు. దీనికి సమంత వెంటనే రియాక్ట్ అవుతూ.." గతంలో తప్పులు చేసిన మాట నిజమే. అవి తెలియక చేసిన తప్పులు. తెలుసుకున్న తర్వాత అలాంటి వాటిని ప్రమోట్ చేయడం పూర్తిగా ఆపేశాను. ప్రస్తుతం ఏవైతే ఆచరిస్తున్నానో.. వాటిని మాత్రమే చెబుతున్నాను" అని తెలిపింది. Also Read : ‘కల్కి’ కోసం విజయ్ దేవరకొండ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు? ఇక టాలీవుడ్ లో గత ఏడాది 'ఖుషి' మూవీ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత ఇప్పుడు మళ్ళీ వరుస సినిమాలతో బిజీ కాబోతోంది. ఇప్పటికే తన సొంత నిర్మాణ సంస్థలో 'మా ఇంటి బంగారం' అనే సినిమాలో నటిస్తోంది. అటు రీసెంట్ గానే ఓ మాలీవుడ్ ఆఫర్ కూడా అందుకుంది. #samantha #actress-samantha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి