Samantha : ఆ చీకటి రోజులు మళ్ళీ నా జీవితంలో రాకూడదు.. గతం గుర్తు చేసుకుని బాధపడ్డ సమంత!

సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో తన గతాన్ని గుర్తు చేసుకుని బాధపడ్డారు.' గత మూడేళ్లుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. గడిచిన రోజులు మళ్లీ నా జీవితంలో రాకూడదని కోరుకుంటున్నా. ప్రస్తుతం అంతా బాగానే ఉంది' అని పేర్కొన్నారు.

New Update
Samantha : ఆ చీకటి రోజులు మళ్ళీ నా జీవితంలో రాకూడదు.. గతం గుర్తు చేసుకుని బాధపడ్డ సమంత!

Samantha Recalls Her Past In Latest Interview : గత కొంత కాలంగా అనారోగ్యంతో సినిమాలకు దూరంగా ఉన్న సమంత.. ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతుంది. ఈ క్రమంలోనే ఇటీవలే 'మా ఇంటి బంగారం' పేరుతో కొత్త సినిమాని అనౌన్స్ చేసింది. దీనికంటే ముందే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి 'సిటాడెల్‌' అనే వెబ్ సిరీస్ చేసింది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ని డైరెక్ట్ చేసిన రాజ్ అండ్ డీకే దీనికి దర్శకత్వం వహించారు.

త్వరలోనే ఈ సిరీస్ రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్.. తన పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇందులో భాగంగానే నాగచైతన్యతో విడాకుల విషయంపై కూడా నోరు విప్పారు. ఈ మేరకు సమంత మాట్లాడుతూ.." ప్రతి ఒక్కరు తమ జీవితంలో మార్పు కావాలని కోరుకుంటున్నారు. విభిన్న కథలను ప్రేక్షకులకు అందించడమే నా లక్ష్యం.

Also Read : ‘మార్ ముంత చోడ్ చింతా’ సాంగ్ వచ్చేసింది.. కేసీఆర్ డైలాగ్ ను భలే వాడారుగా!

గతం వెనక్కి తిరిగి చూస్తే.. నాకు ఎలాంటి మార్గం కనిపించలేదు. నా స్నేహితులతో ఇదే విషయంపై చాలాసార్లు చర్చించాను. గత మూడేళ్లుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. గడిచిన రోజులు మళ్లీ నా జీవితంలో రాకూడదని కోరుకుంటున్నా. ప్రస్తుతం అంతా బాగానే ఉంది. మునుపటి కంటే బలంగా తయారయ్యా. ఆ చీకటి రోజుల నుంచి బయటపడితేనే జీవితంలో విజయం సాధిస్తాం" అని చెప్పుకొచ్చింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు