Samantha : షారుఖ్ సినిమాలో సమంత.. అసలు క్లారిటీ ఇదే!

సమంత షారుక్ ఖాన్ సరసన నటించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసందే. స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్‌ హిరానీ ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నట్లు న్యూస్ వినిపించింది. తాజాగా ఈ వార్తలపై డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తలన్నీఫేక్ అని అన్నారు.

Samantha : షారుఖ్ సినిమాలో సమంత.. అసలు క్లారిటీ ఇదే!
New Update

Samantha In Shah Rukh Khan Movie : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ప్రెజెంట్ తన హెల్త్ పై ఫోకస్ చేసిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ తో నిత్యం టచ్ లోనే ఉంటోంది. త్వరలోనే సమంత మళ్ళీ సినిమాలతో బిజీ కానుంది. ఇప్పటికే ఆమె లీడ్ రోల్ లో 'మా ఇంటి బంగారం' అనే సినిమాని ప్రకటించింది. ఇక తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్ లో షారుక్ ఖాన్ సరసన నటించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్‌ హిరానీ (Rajkumar Hirani) ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నట్లు, దేశభక్తితో కూడిన యాక్షన్‌ అడ్వంచరస్‌ కథాంశంతో ఈ సినిమా ఉంటుందని బీ టౌన్ లో న్యూస్ వినిపించింది. అయితే తాజాగా ఈ వార్తలపై డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ సన్నిహితులు క్లారిటీ ఇస్తూ ఆ వార్తలను కొట్టిపారేశారు. ప్రస్తుతం ఆయన స్క్రిప్ట్‌ రాసే దశలోనే ఉన్నారని తెలిపారు. ఈ సినిమాకు నటీనటులను ఎంపిక చేయలేదని పేర్కొన్నారు.

Also Read : ఇండస్ట్రీ మేలుకోసమే కలిశాం.. పవన్ తో భేటీ పై అల్లు అరవింద్!

ఈ వార్తలన్నీ ఫేక్ అని డైరెక్టర్‌ సన్నిహితులు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి షారుఖ్, సమంతతో ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. కాగా షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబోలో గత ఏడాది 'డంకి' (Dunki) మూవీ థియేటర్స్ లోకి వచ్చింది. ఎమోషనల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకున్నప్పటికీ కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది.

#samantha #shah-rukh-khan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe