Samantha : మరో వెబ్ సిరీస్ కు సమంత గ్రీన్ సిగ్నల్.. టైటిల్ కూడా ఫిక్స్!

సమంత తాజాగా మరో వెబ్ సిరీస్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించే తాజా వెబ్‌ సిరీస్‌లోసమంత లీడ్‌ రోల్‌ ప్లే చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్‌ సిరీస్‌కి రక్తబీజ్' అనే టైటిల్‌ ఖరారు చేశారట. ఆగస్ట్‌లో షూటింగ్‌ మొదలు కానుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Samantha : మరో వెబ్ సిరీస్ కు సమంత గ్రీన్ సిగ్నల్.. టైటిల్ కూడా ఫిక్స్!
New Update

Samantha Gives Green Signal to Another Web Series : 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న సమంత.. ఆ సిరీస్ లో నెగెటివ్ రోల్ లో అదరగొట్టింది. రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ను తెరకెక్కించారు. వీళ్లతోనే 'సిటాడెల్' అనే మరో సిరీస్ చేసింది సామ్. ఇందులో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ తో కలిసి నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది.

ఇక తాజాగా మరోసారి ఈ కాంబో రిపీట్ కానున్నట్టు తెలుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్ తర్వాత సమంత.. రాజ్ అండ్ డీకే లతో ముచ్చటగా మూడోసారి వర్క్ చేయబోతుంది. ఈ మేరకు ఇప్పుడు మరో వెబ్ సిరీస్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించే తాజా వెబ్‌ సిరీస్‌లోసమంత లీడ్‌ రోల్‌ ప్లే చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read : ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి ‘స్టెప్పమార్’ ఫుల్ సాంగ్ వచ్చేసింది.. రామ్ ఊరమాస్ స్టెప్స్ అదుర్స్!

కంప్లీట్ యాక్షన్‌ నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌లో బాలీవుడ్‌ హీరో ఆదిత్య రాయ్‌ కపూర్‌ కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఈ వెబ్‌ సిరీస్‌కి 'రక్తబీజ్' అనే టైటిల్‌ ఖరారు చేశారట. ఆగస్ట్‌లో షూటింగ్‌ మొదలు కానుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ వెబ్‌ సిరీస్‌ కోసం సమంత ఇప్పటికే ప్రిపరేషన్‌ స్టార్ట్‌ చేసిందట. యాక్షన్‌ సిరీస్‌ కావడంతో మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సిరీస్ కు సంబంధించి మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్టు సమాచారం.

#samantha-new-web-series #raj-and-dk #samantha
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe