Citadel: ఫ్యాన్స్ కు బిగ్ అప్ డేట్ ఇచ్చిన సమంత.. పోస్ట్ వైరల్

స్టార్ నటి సమంత తన అప్ కమింగ్ వెబ్ సిరీస్ 'సిటాడెల్'కు సంబంధించి అభిమానులకు బిగ్ అప్ డేట్ ఇచ్చింది. యాక్షన్‌ థ్రిల్లర్ షూటింగ్‌ పూర్తి చేసుకున్నట్లు తెలిపింది. తన పాత్రకు డబ్బింగ్‌ కూడా మొదలుపెట్టినట్లు చెబుతూ స్టూడియోలో ఫొటోలను షేర్ చేసింది.

New Update
Citadel: ఫ్యాన్స్ కు బిగ్ అప్ డేట్ ఇచ్చిన సమంత.. పోస్ట్ వైరల్

Samantha: స్టార్ నటి సమంత (Samantha) తన అప్ కమింగ్ వెబ్ సిరీస్ కు సంబంధించి అభిమానులకు బిగ్ అప్ డేట్ ఇచ్చింది. వరుణ్‌ధావన్‌, సమంత ప్రధాన పాత్రల్లో రాజ్‌ అండ్‌ డీకే తెరకెక్కిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌ ‘సిటాడెల్‌’ (Citadel) షూటింగ్‌ పూర్తి చేసుకున్నట్లు తెలిపింది. ఈ సిరీస్‌ తాజాగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉందని, సిరీస్‌లో తన పాత్రకు డబ్బింగ్‌ కూడా మొదలు పెట్టినట్లు చెబుతూ స్టూడియోలో ఫొటోలను ఇన్‌స్టా వేదికగా పంచుకుంది.

1990ల నేపథ్యంలో ఈ సిరీస్‌ సాగుతోందని తెలుస్తుండగా.. ‘ఫ్యామిలీ మ్యాన్‌2’లో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో అదరగొట్టిన సమంత ‘సిటాడెల్‌’ కోసం ప్రత్యేకంగా సిద్ధమైంది. మార్షల్‌ ఆర్ట్స్‌లోనూ శిక్షణ తీసుకుంది. ముఖ్యంగా వరుణ్‌, సామ్‌ కలిసి చేసే యాక్షన్‌ సన్నివేశాలు అలరిస్తాయని టాక్‌.

ఎలాంటి డూప్‌ లేకుండా ఆమే స్వయంగా యాక్షన్‌ సీక్వెన్స్‌ను పూర్తి చేశారట. ఈ క్రమంలోనే స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. రుస్సో బ్రదర్స్‌ నిర్మిస్తున్న ఈ సిరీస్‌ పలు దేశాల్లో, వివిధ భాషల్లో రూపొందుతోంది.

Advertisment
తాజా కథనాలు