Producer Samantha : సమంత...ఈ అమ్మాయిని ఇష్టపడని వారు ఎక్కువ మంది ఉండరు. జెస్సీగా పరిచయమై కుర్రకారు హృదయాలను దోచేసిన సామ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. తరువాత పెద్ద హీరోయిన్ గా ఎదగడం, నాగ చైతన్యతో పెళ్ళి, విడాకులు...మయోసైటిస్ బారిన పడడం ఇలా సమంత జీవితం చాలా మార్పులకే లోనయింది. అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని దూసుకుపోయింది. అయితే కొంతకాలం క్రితం తన ఆరోగ్య రిత్యా కొన్నాళ్ళు అంటే దాదాపు ఏడాది పాటూ సినిమాలకు దూరంగా ఉంటానంటూ ప్రకటించింది. అప్పటి నుంచీ సోషల్ మీడియా ద్వారా అభిమానులను మెస్మరైజ్ చేస్తూనే ఉన్నాయి మూవీస్ మాత్రం చేయడం లేదు. తాజాగా ఇప్పుడు సామ్ కొత్త అవతారం ఎత్తినట్టు తెలుస్తోంది. హీరోయిన్ గా సినిమాల్లోకి ఇంకా రాకపోయినా..నిర్మాతగా ఎంట్రీ ఇస్తూ అందరినీ బిగ్ సర్ ప్రైజ్ చేసింది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే కొత్త ప్రొడక్షన్ కంపెనీని స్టార్ట్ చేసింది సమంత.
Also Read : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవి ఎన్నికకు నోటిషికేషన్
ట్రాలాలా(Tralala) కు సంబంధించి సమంత(Samantha) నే స్వయంగా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. తన సంస్థ లోగోను కూడా షేర్ చేసింది. సినిమా ప్రపంచంలో కొత్త ప్రతిభను ప్రోత్సహించడంతో పాటూ అర్ధవంతమైన, మంచి కథల్ని సినిమాలుగా రూపొందిస్తానని చెబుతోంది సామ్. కొత్తవారికి ఇదొక మంచి అవకాశం అవుతుందని అంటోంది. ఇంగ్లీష్ పాప్ సాంగ్ అయిన బ్రౌన్ గర్ల్ ఇన్ ది రింగ్ లో వచ్చే ట్రాలాలా అనే పదాన్ని తన సంస్థకు పేరుగా తీసుకున్నానని వివరించింది.
ఇక సినిమాలను నిర్మించే విషయంలో హైదరాబాద్ కు చెందిన ఎంటర్టైన్మెంట్ కంపెనీ మండోవా మీడియా వర్క్స్ తో సమంత ఒప్పందం కుదుర్చుకుంది. వీరిద్దరి భాగస్వామ్యంలో వెబ్ సీరీస్ లు, సినిమాలతో పాటూ టీవీ ప్రోగ్రామ్స్ కూడా రూపొందించే అవకాశం ఉందని మండోవా మీడియా చెబుతోంది.