లోక్‌సభ ఎన్నికల వేళ.. దక్షిణ భారతీయులపై కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. భారతీయుల చర్మ రంగుపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అతడు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. ఎన్నికల తర్వాత ఈసారి కూడా ఆయన కోల్పోయిన పదవిని దక్కించుకున్నారు. శామ్ పిట్రోడాను బుధవారం ఇండియన్ ఓవర్సీర్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా మళ్లీ కాంగ్రెస్ పార్టీ పదవి కట్టబెట్టింది.
Also read: ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ శాలరీ.. ఆయనకు ఉండే పవర్స్ ఏంటో తెలుసా?
శామ్ పిట్రోడాను వెంటనే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారని.. సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇదిలాఉండగా.. లోక్‌సభ ఎన్నికలకు ముందు శామ్ పెట్రోడా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో మాట్లాడుతూ.. తూర్పు భారతీయులు చైనియుల్లా.. దక్షిణ భారతీయులు ఆఫ్రికన్‌లల కనిపిస్తారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదస్పదం అవ్వడంతో.. తీవ్ర విమర్శలు వచ్చిన వేళ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయనికి పదవి అప్పగించడం చర్చనీయం అవుతోంది.
Also Read: వాహనదారులకు గుడ్ న్యూస్.. టోల్ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన!