బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన లైఫ్ స్టైల్ గురించి ఓపెన్ అయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు కొంతకాలంగా రోడ్ సైడ్, ఫంక్షన్ లలో ఫుడ్ తినట్లేదని చెప్పారు. అంతేకాదు ప్రయాణాలు కూడా చాలా తగ్గించుకున్నట్లు తెలిపారు. ఎప్పుడైనా తన తల్లి బయటకు తీసుకెళ్లమని అడిగితే ఇంటి దగ్గర కాఫీ షాప్ వెళ్తున్నానంటూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఈ మేరకు ఇటీవల వచ్చిన ‘టైగర్3’ మూవీతో బిగ్ హిట్ అందుకున్న ఆయన.. మూవీ సక్సెస్ మీట్‌లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఓ హాలీవుడ్ టీవీ చానెల్ తో మాట్లాడుతూ.. ‘కొన్ని సంవత్సరాల దాదాపు 25 ఏళ్ల నుంచి బయట డిన్నర్లకు వెళ్లడం మానేశాను. కేవలం సినిమా షూటింగ్‌లకు, ప్రమోషన్ల కోసం మాత్రమే బయటకు వస్తున్నా. నాకు అవుట్ డోర్ అంటే ఇంట్లో బాల్కనీలో కూర్చోవడం లేదంటే నా ఫామ్‌హౌస్‌కు వెళ్లడం అంతే. నా ప్రయాణాలంటే ఇల్లు, షూటింగ్, హోటల్, ఎయిర్‌పోర్టు, లొకేషన్, తిరిగి ఇంటికి రావడం, జిమ్‌కు వెళ్లడం. ఇవే నేను చేస్తున్న ప్రయాణాలు. నా కుంటుంబ సభ్యులతో కంటే ఎక్కువగా నా సిబ్బందితోనే గడుపుతున్నా. షాపింగ్‌లకు కూడా వెళ్లడం మానేశాను. ఎప్పుడైనా మా అమ్మ బయటకు తీసుకెళ్లమంటే దగ్గర్లో ఉన్న హోటల్ లేదా కాఫీషాప్‌నకు తీసుకెళ్తున్నాను. నాకు తప్పని సరి అయిన పనులకోసం మాత్రమే బయటకు వెళ్తున్నా. సినిమా షూటింగ్ టైమ్ లోనూ అనవసరంగా తిరగట్లేదు' అంటూ చెప్పుకొచ్చారు.
Also read : బర్రెలక్క పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. సర్కారుకు నోటీసులు
అలగే ‘2012లో ‘ఏక్తా టైగర్’ సినిమా కథను దర్శకుడు చెప్పాగానే అంగీకరించానని, ఆ స్టోరీ తనకెంతో నచ్చిందన్నారు. 'యశ్ రాజ్ ఫిల్మ్స్‌లో అదే నా తొలి చిత్రం. ఇప్పటికి కూడా నేను సూపర్ స్టార్ అని అనుకోవడం లేదు. నాకు వచ్చిన పాత్రకు వందశాతం న్యాయం చేయగలుగుతున్నానా లేదా అన్నదే చూస్తాను. అలాగే మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో సపోర్టింగ్ పాత్రల్లో చేయడానికి కూడా నేనేం ఆలోచించను. ప్రేక్షకులకు వినోదం అందించడమే నా లక్ష్యం’ అన్నారు. ఇక దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'టైగర్ 3' రూ.400 కోట్లు వసూళ్లు రాబట్టింది. యాష్ రాజ్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన సినిమాకు మనీష్ శర్మ దర్శకత్వం వహించాడు. కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది.