Sikander: 'సికంద‌ర్' నుంచి సాలిడ్ అప్ డేట్.. రిలీజ్ డేట్ అనౌన్స్!

ఎట్టకేలకు బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్, స్టార్ డైరెక్టర్ ముర‌గ‌దాస్ కాంబోలో రాబోతున్న 'సికంద‌ర్' నుంచి బిగ్ అప్ డేట్ వెలువడింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెరకెక్కించబోతున్న సినిమాను 2025 ఈద్ పండుగ సంరద్భంగా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

New Update
Sikander: 'సికంద‌ర్' నుంచి సాలిడ్ అప్ డేట్.. రిలీజ్ డేట్ అనౌన్స్!

Salman khan: ఎట్టకేలకు బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్, డైరెక్టర్ ముర‌గ‌దాస్ కాంబోలో రాబోతున్న 'సికంద‌ర్' నుంచి బిగ్ అప్ డేట్ వెలువడింది. 'జైహో' లాంటి భారీ హిట్ త‌ర్వాత వీరిద్దరి కలయికలో సినిమాను ప్రకటించినప్పటి నుంచి భారీ అంచనాలు పెరిగిపోయాయి. దీంతో సినిమా అప్ డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తుంన్నారు. ఈ క్రమంలోనే రంజాన్ పండుగ సందర్భంగా మేకర్స్ మూవీ డేట్ అనౌన్స్ చేశారు.

ఇది కూడా చదవండి: Gopichand: ‘విశ్వం’.. విలన్ అవతారంలో పిచ్చెక్కించిన గోపిచంద్: వీడియో వైరల్!

హై వోల్టేజ్ యాక్షన్ ఎంట‌ర్ టైన‌ర్..
ఈ మేరకు హై వోల్టేజ్ యాక్షన్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెరకెక్కించబోతున్న సినిమాను 2025 ఈద్ పండుగ సంరద్భంగా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. సాజిద్ నదియాడ్‌వాలా నిర్మిస్తున్న మూవీ టైటిల్ పోస్టర్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈద్ అంటే స‌ల్మాన్ కి ఎంతో ఇష్టమైన పండుగ‌ని, ఆ రోజు ఏదో గుడ్ న్యూస్ ఇవ్వడం సల్లుభాయ్ కు అల‌వాటంటా. అందుకే 'సికిందర్' సినిమా కూడా ఈద్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీ రోల్ పోషించబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు