హైదరాబాద్‌లో ప్రైవేట్ స్కూల్స్‌లో యూనిఫామ్, షూస్, బెల్టులు అమ్మడం నిషేధించబడింది. STATE, CBSE, ICSE పాఠశాలలకు ఈ నిబంధన వర్తిస్తుంది. అయితే స్టేషనరీ, పుస్తకాలు వంటివి మాత్రం నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ మీద అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా ఎడ్యుకేషనల్ అధికారి రోహిణి ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రైవేట్ స్కూల్లలో ఈ నిబంధలను అమలు చేస్తున్నా లేదా అని పర్యవేక్షించేందుకు మండల స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేయాలని డిప్యూటీ ఎడ్యుకేషనల్ అధికారులను ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also Read: కటింగ్ నచ్చలేదని ఒకరు.. ఎండలో ఆడొద్దన్నందుకు మరొకరు.. 9 ఏళ్ల చిన్నారుల ఆత్మహత్యలు