Forceful Death : కటింగ్ నచ్చలేదని ఒకరు.. ఎండలో ఆడొద్దన్నందుకు మరొకరు.. 9 ఏళ్ల చిన్నారుల ఆత్మహత్యలు తండ్రి ఇష్టం లేని కటింగ్ చేయించారని ఒకరు, తల్లి ఎండలో ఆడుకోవద్దని మరొకరు ప్రాణాలు తీసుకున్న ఘటనలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం నింపాయి. ఈ ఇద్దరు 9 ఏళ్ల వారే కావడం మరింత చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి. By Nikhil 31 May 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Two Children's Last Their Lives : ఉమ్మడి వరంగల్ జిల్లా (Warangal District) లో నిన్న ఒక్క రోజే ఇద్దరు చిన్నారులు ఆత్మహత్యకు (Two Children's Suicide) పాల్పడడం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. చిన్న చిన్న కారణాలతో ఆ ఇద్దరు చిన్నారులు ప్రాణాలు తీసుకుని తల్లిదండ్రులకు తీరని విషాదం మిగిల్చారు. ఇష్టం లేని కటింగ్ (Hair Cutting) చేయించారని ఒకరు, ఎండలో ఆడుకోవద్దన్నారని మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహబూబాబాద్ జిల్లా చింతగూడెంకు చెందిన 9 ఏళ్ల హర్షవర్ధన్ తండ్రి ఇష్టం లేని కటింగ్ చేయించాడని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అదే జిల్లా మైసంపల్లికి చెందిన 9 ఏళ్ల సిద్ధు తల్లి ఎండలో తిరగొద్దని తల్లి మందలించిందని ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో ఆ రెండు కుటుంబాల్లో పెను విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి. ఇంత చిన్న వయస్సులో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వారికి ఎలా వచ్చాయి? అన్న చర్చ సాగుతోంది. సినిమాలు, సోషల్ మీడియా (Social Media) ప్రభావంతోనే చిన్నారులు ఈ దారుణానికి పాల్పడ్డారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చిన్నపిల్లల ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? వారు ఏం చేస్తున్నారు? అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా ఇలాంటి పిల్లలు ఇలా చేసుకోకుండా కాపాడుకోవచ్చని వారు చెబుతున్నారు. Also Read : 108 డిగ్రీల జ్వరంతో వ్యక్తి మృతి.. హడలిపోతున్న జనం! #forceful-death #warangal #social-media మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి