Salaar : ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కి గుడ్‌ న్యూస్‌..సలార్‌ ట్రైలర్‌ ఎప్పుడంటే!

సలార్‌ ట్రైలర్‌ ను డిసెంబర్‌ 01 రాత్రి 7 గంటల 19 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపారు. ఈ చిత్రాన్ని మాఫియా బ్యాక్‌గ్రౌండ్‌ లో తెరకెక్కిస్తున్నారు.ప్రశాంత్‌ నీల్ ఈ సారి అంతర్జాతీయ మాఫియా చుట్టూ తిరిగే కథాంశంతో సలార్‌ ను తెరకెక్కిస్తున్నాడు

Salaar : ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కి గుడ్‌ న్యూస్‌..సలార్‌ ట్రైలర్‌ ఎప్పుడంటే!
New Update

ప్రభాస్‌(Prabhas) ఫ్యాన్స్‌ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సినిమా సలార్‌ (Salaar)  ఒకటి. కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌(Prasanth neel) , ప్రభాస్‌ కాంబినేషన్‌ లో వస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్నట్లు ముందుగానే చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పటికే విడుదల చేసిన సలార్‌ పార్ట్‌ 1 సీజ్‌ఫైర్ టీజర్‌ నెట్టింట వైరల్‌ అవుతూ..మిలియన్ల సంఖ్యలో వీక్షకులను రాబడుతోంది.

ఈ చిత్రంలో శ్రుతి హాసన్‌ హీరోయిన్‌ గా నటిస్తుంది. ఈ చిత్రం డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్‌ ను ఎప్పుడు లాంఛ్‌ చేస్తారా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీపావళి కానుకగా ట్రైలర్‌ లాంఛ్‌ అధికారిక ప్రకటనతో పాటు విడుదల టైంని కూడా ప్రకటించారు మేకర్స్‌.

ఈ సలార్‌ ట్రైలర్‌ ను డిసెంబర్‌ 01 రాత్రి 7 గంటల 19 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపారు. ఈ చిత్రాన్ని మాఫియా బ్యాక్‌గ్రౌండ్‌ లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ టీజర్ లో డార్క్‌ షేడ్స్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో స్టన్నింగ్‌ విజువల్స్‌ మధ్య సలార్‌ గా రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ఎంట్రీ ఇస్తున్న సన్నివేశాలు ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

ప్రశాంత్‌ నీల్ ఈ సారి అంతర్జాతీయ మాఫియా చుట్టూ తిరిగే కథాంశంతో సలార్‌ ను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో ఓ అంతర్జాతీయ నటుడు కూడా ఇందులో నటిస్తున్నట్లు ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. దీనిపై హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌ అండ్‌ మేకర్స్ టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

ఈ చిత్రంలో మాలీవుడ్‌ స్టార్‌ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్‌ బ్యానర్‌ పై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్న సలార్ పార్ట్‌ 1 2023 డిసెంబర్‌ 22న ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌ గా విడుదల కానుంది.

Also read: కార్తీక మాసం ఎప్పటి నుంచి..పాటించాల్సిన నియమాలు ఏంటి!

#prabhas #salaar #trailor
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe