Salaar collections:డైనోసార్ వచ్చాడు..అన్ని సినిమాల కలెక్షన్లను తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు.

ప్రభాస్ కు కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా సలార్. హీరో అంటే ఇలా ఉండాలి...కటౌట్ అంటే ఇదీ అని చూపించిన డార్లింగ్...కలెక్షన్లు కూడా ఈ రేంజ్ లో ఉండాలని చూపించాడు. మరోసారి తన పాన్ ఇండియా రేంజ్ ఏంటో నిరూపించాడు. ఈ ఇయర్ మూడు హిట్ సినిమాల వసూళ్ళను మట్టికరిపించేశాడు.

New Update
Salaar collections:డైనోసార్ వచ్చాడు..అన్ని సినిమాల కలెక్షన్లను తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు.

ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ మూవీకి మొదటి నుంచి పాజిటివ్ బజ్ ఉంది. దీనికి తగ్గట్టే బెనిఫిట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ప్రభాస్ కటౌట్ ను కరెక్ట్ గా చూపించడంలో సక్సె అయిన ప్రశాంత్ నీల్ డార్లింగ్ కు ఇన్నాళ్ళకు కరెక్ట్ సినిమా పడేలా చేశాడు. ఇక ఇక ఈ మూవీ కలెక్షన్స్ పరంగా కూడా మొదటిరోజే ఎన్నో రికార్డులను బద్దలగొట్టింది. ఇప్పటివరకు వచ్చిన అన్ని హిట్ సినిమాలను వెనక్కి తోసి మొదటిరోజే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా సలార్ నిలిచింది. ఈ ఏడాది విడుదలయిన అన్ని సినిమాల్లో సలార్ డే 1 కలెక్షన్సే అత్యధికంగా వసూలయ్యాయి. సలార్ రెండు రోజులకు కలిపి 178 కోట్ల గ్రాస్ తో వామ్మో అనిపించాడు.

Also Read:అరేబియా సముద్రంలో నౌకపై డ్రోన్ దాడి

2023లో విడుదలయిన అన్ని సినిమాల్లో మొదటిరోజే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాలుగా యానిమల్, జవాన్, పఠాన్ నిలిచాయి. ఇప్పుడు ఏకంగా ఆ మూడు సినిమాను దాటి సలార్ అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్‌ను సాధించింది. ఇప్పటికే సలార్ పాజిటిక్ టాక్‌తో దూసుకుపోతుందని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. ఇక కలెక్షన్స్ విషయంలో కూడా రికార్డులు బ్రేక్ చేస్తుంటే డబుల్ సంతోషంలో మునిగిపోయారు. మొదటిరోజే ఈ సినిమా చూడాలని చాలామంది ఫ్యాన్స్, మూవీ లవర్స్ థియేటర్స్ మీద పడ్డారు. దానివల్ల ప్రీ బుకింగ్, ఫస్ట్ డే కలెక్షన్స్‌పై పాజిటివ్ ప్రభావం పడిందని ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు.ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం సలార్ దేశవ్యాప్తంగా ఓపెనింగ్ రోజే రూ.95 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ మూవీ కలెక్షన్స్ ఒక రేంజ్‌లో ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఓపెనింగ్ రోజే రూ.70 కోట్లను కలెక్ట్ చేసింది సలార్. రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు సలార్ సినిమాతో దాదాపు 88.93 శాతం నిండిపోయాయి.

ఇక దేశంలో మిగతా రాష్ట్రాలు అయిన కర్ణాటక, కేరళల్లో కూడా సలార్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. కర్ణాటకలో రూ.12 కోట్లు, కేరళలో రూ.5 కోట్లు కలెక్షన్స్‌ను రికార్డ్ చేసుకుంది ఈ మూవీ. ఇక సలార్ బ్రేక్ చేసిన రికార్డుల విషయానికొస్తే.. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ ఇండియాలో రూ.57 కోట్ల ఓపెనింగ్ డే కలెక్షన్స్‌ను సాధించింది. ఆ తర్వాత షారూక్ దే మరో సినిమా జవాన్ అయితే ఏకంగా రూ.75 కోట్ల ఓపెనింగ్ డే కలెక్షన్స్‌ను సాధించింది. ఇక లేటెస్ట్ గా విడుదల అయిన...సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన సెన్సేషనల్ మూవీ యానిమల్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ రూ.63 కోట్లు. ఇప్పుడు వీటన్నింటినీ దాటేస్తూ సలార్ ఏకంగా మొదటిరోజే రూ.95 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్స్‌ను సాధించింది. దీంతో ఓపెనింగ్ డే కలెక్షన్స్ విషయంలో రికార్డును ఒక రేంజ్‌లో సెట్ చేశాడు ప్రభాస్. ఈ కలెక్షన్ల వర్షం ఇలాగే కొనసాగితే యానిమల్ అన్ని రికార్డులను తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు డైనోసార్ ప్రభాస్.

Advertisment
తాజా కథనాలు