Sajjala Ramakrishna Reddy: సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడిని ఖండించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇది పూర్తిగా పిరికిపంద చర్య అని అన్నారు. ప్రజలు నుండి వస్తున్న స్పందన చూసి ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయి అని పేర్కొన్నారు. కంటి పై భాగంలో దాడి జరిగింది.. ఒకవేళ అది క్రిందకు తగిలితే ఎంత ప్రమాదం జరిగి ఉండేది? అని ప్రశ్నించారు. వెల్లంపల్లి శ్రీనివాస్ కు కంటిపై దాడి చేశారని.. ఎయిర్ గన్ లాంటి ఆయుధాలతో దాడి చేశారని ఆరోపించారు.
అంత పెద్ద గాయం అయ్యింది.. కచ్చితంగా బలమైన ఆయుధంతో దాడి చేసారని అభిప్రాయడ్డారు. ఇది తుంటరి ముకల చర్య కాదు.. దేశ ప్రధాని తో చాలా మంది జగన్ మీద దాడిని ఖండించారు.. చంద్రబాబు కూడా ఖండించడంతో దోషులను శిక్షించాలని కోరారు. టీడీపీ నేతలు ఇదంతా నటన అంటూ మాట్లాడాతున్నారని ఫైర్ అయ్యారు. బుద్ది ఉన్నవాడు ఏవడైనా.. ఇలా మాట్లాడుతారా? అని మండిపడ్డారు. వాళ్లు అసలు మనుషులేనా? అని అన్నారు.
అధికార వైఫల్యం అంటూ టీడీపీ నేతలు అంటున్నారని.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. జరిగిన దాడిని అధికారులు వైఫల్యం అని ఎందుకు అనలేదు అని నిలదీశారు. రాజకీయాలు పక్కన పెడితే... చంద్రబాబు పెద్ద నటుడు అని సెటైర్లు వేశారు. 2003 లో చంద్రబాబు మీద జరిగిన అటాక్ కూడా నటనేనా? అని ప్రశ్నించారు. జగన్ ప్రజల్లోకి వచ్చిన తరవాత చంద్రబాబు లో భయం పట్టుకుందని అన్నారు. ఆ భయం చంద్రబాబు టోన్ మారిందని ఎద్దేవా చేశారు.