Sajjala Comments : ఏపీలో అంగన్వాడీల సమ్మె(Anganwadis strike), వేతనాల పెంపు(increase in wages)పై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy)కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంగన్వాడీల వేతనాలను పెంచలేమని తేల్చి చెప్పారు సజ్జల. వేతనాలు పెంచలేము కాబట్టే చేయలేమని చెబుతున్నామన్నారు. ఎన్నికల తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి వేతనాల పెంపు గురించి ఆలోచిస్తామని సజ్జల క్లారిటీ ఇచ్చారు.
ప్రభుత్వం నిజాయితీగా చెబుతోంది:
జగన్ సర్కార్ ఉన్న విషయాన్ని నిజాయితీగా చెబుతోందన్నారు. భవిష్యత్తులో వేతనాలు పెంచుతామని..సమ్మెను విరమించాలని మరోసారి అంగన్వాడీలను కోరుతున్నట్లు చెప్పారు. రాజకీయ అజెండాకు అంగన్వాడీలు బలికావద్దని కోరారు. జగన్ ను లక్ష్యంగా చేసుకుని రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరిపైనా ఎక్కడా కూడా దురుసుగా ప్రవర్తించవద్దని పోలీసులను కోరారు సజ్జల. ప్రత్యామ్నాయ చర్యలకు అడ్డుపడినట్లయితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెగేంత వరకు లాగడం మంచిదని కాదన్నారు. మావైపు నుంచి లాంటిటి ఉండదన్నారు. మీ వైపు నుంచి అలా చేయవద్దని సజ్జల హెచ్చరించారు.
కొన్ని శక్తులు ఈ సమ్మెను నడిపిస్తున్నాయి:
అంగన్వాడీల సమ్మెలో రాజకీయ ప్రమేయం ఉందని ఆరోపించారు సజ్జల. కొన్ని శక్తులు ఈ సమ్మెను నడిపిస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు. మేము వారికి ఏం చేయలో అది చేశాం..ఎంతకాలంలో సమ్మె చేస్తారు..ఇంతకాలం చెబుతూనే ఉన్నాం. జైలుకైనా పోతామంటూ కొందరు అంగన్వాడీ వర్కర్ల సంఘం నేతలు అంటున్నారు. ఇఫ్పుడే జీతాలు పెంచలేమని చెబుతూనే ఉన్నాము. మళ్లీ గెలిచిన తర్వాత జీతాల పెంపుపై ఆలోచిస్తాం. ఇప్పటికైనా సమ్మె పై వెనక్కి తగ్గాలి అని సజ్జల అన్నారు.
నేటి నుంచి చట్టపరమైన చర్యలు:
ఇక అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ సోమవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. ఇవాళ్టి నుంచి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంశానికి సంబంధించి జిల్లా కలెక్టర్ల ద్వారా ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర సేవల కింద అంగన్వాడీల సేవలు ఉన్నాయి. కాబట్టి విధుల్లో చేరకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సమ్మెలో ఉన్న అంగన్వాడీ వర్కర్లకు ఆదేశాలు జారీ చేసింది సర్కార్. అయితే అంగన్వాడీలు మాత్రం ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ప్రభుత్వం తమతో చర్చలు జరపాలని..న్యాయబద్వమైన డిమాండ్లను పరిష్కరించాలని..అప్పటి వరకు సమ్మెను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.
ఇది కూడా చదవండి: తిరుమలకు వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. టీటీడీ ఈఓ కీలక ప్రకటన!