Criminal Case On Sajjala : సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు
వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు అయింది. కౌంటింగ్ ఏజెంట్ల విషయంలో రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.