SAIL Suspension : ప్రభుత్వ రంగ ఉక్కు కంపెనీ సెయిల్‌కు చెందిన ఇద్దరు బోర్డు స్థాయి అధికారులను, ఐరన్ ఓర్ మేజర్ ఎన్‌ఎండిసి(NMDC) డైరెక్టర్‌ను ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేసింది. వీరు తన పదవిని దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా నిబంధనలను ఉల్లంఘించినందుకు 26 మంది అధికారులను సెయిల్ తక్షణమే తొలగించింది.
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SAIL Suspension) ప్రవర్తన, క్రమశిక్షణ, అప్పీల్ రూల్స్, 1977 కింద ఇచ్చిన అధికారాలు దుర్వినియోగం అయ్యాయి అని స్టీల్ మంత్రిత్వ శాఖ, జనవరి 19, 2024న పంపిన లేఖలో BSEకి ఒక ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ కారణంగా డైరెక్టర్ (కమర్షియల్) విఎస్ చక్రవర్తి, డైరెక్టర్ (ఫైనాన్స్) ఎకె తులసియానిని తక్షణమే సస్పెండ్ చేశారు. ఎన్‌ఎండిసి తన బోర్డు స్థాయి అధికారి వి.సురేష్‌ను తక్షణమే తొలగించినట్లు ప్రకటించింది.
కింది స్థాయి అధికారులపైనా చర్యలు
కంపెనీకి చెందిన 26 మంది దిగువ స్థాయి అధికారులను(SAIL Suspension) కూడా తక్షణమే తొలగించినట్లు సెయిల్ తెలిపింది. వీటిలో S.K. శర్మ, ED (F&A), CMC, వినోద్ గుప్తా, ED (కమర్షియల్), అతుల్ మాథుర్, ED (సేల్స్ & ITD) మరియు R.M. సురేష్, ED (మార్కెటింగ్ సర్వీసెస్) మొదలైనవారున్నారు. లోక్‌పాల్ ఆదేశాల మేరకు జరుగుతున్న కొన్ని ఇన్వెస్టిగేషన్స్ కి సంబంధించి ఈ సస్పెన్షన్స్ జరిగాయని సెయిల్ ప్రత్యేక ప్రకటనలో పేర్కొంది.
Also Read: అయోధ్య రామమందిరంలో ప్రపంచంలోనే ఖరీదైన రామాయణం
ఈ చర్య కంపెనీ పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపదు: సెయిల్ ఛైర్మన్
సెయిల్ ఛైర్మన్ అమరేందు ప్రకాష్ మాట్లాడుతూ, 'కంపెనీ వ్యాపారం సాధారణంగా నడుస్తోంది ఇది కంపెనీ పనితీరుపై ఎటువంటి ప్రభావం చూపదు అన్నారు. కార్పొరేట్ గవర్నెన్స్, నైతిక ప్రవర్తన అత్యున్నత ప్రమాణాలను నిర్వహించడానికి మేము అంకితభావంతో ఉన్నాము. విక్రయాల నాణ్యత - కస్టమర్ సంతృప్తిపై దృష్టి సారించి, మేము పరిశ్రమలో బలంగా ఉన్నాము అని ఆయన చెప్పారు.
సెయిల్ దేశంలో అతిపెద్ద ఉక్కు తయారీ కంపెనీ
ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రకారం, సెయిల్(SAIL Suspension) దేశంలోనే అతిపెద్ద ఉక్కు తయారీ కంపెనీ. అయితే NMDC భారతదేశపు అతిపెద్ద ఇనుప ఖనిజం ఉత్పత్తి చేసే సంస్థ.
Watch this interesting Video :