Sai Tej : మెగా ఫ్యామిలీ Vs అల్లు ఫ్యామిలీ.. సాయి తేజ్ అలా చేశాడేంటి?

మెగా హీరో సాయి ధరమ్ తాజాగా తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అయిన ఇన్ స్టాగ్రామ్,ట్విట్టర్ లో అల్లు అర్జున్ ను అన్ ఫాలో చేశాడు. దీంతో మెగా, అల్లు ఫ్యామిలీస్ మధ్య విబేధాలు మరోసారి బయటపడ్డాయి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sai Tej : మెగా ఫ్యామిలీ Vs అల్లు ఫ్యామిలీ.. సాయి తేజ్ అలా చేశాడేంటి?
New Update

Sai Durga Tej Un Follows Allu Arjun : ప్రస్తుతం మెగా, అల్లు ఫ్యామిలీస్ మధ్య వార్ నడుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం అల్లు అర్జున్ (Allu Arjun). ఏపీ ఎన్నికల్లో (AP Elections) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జనసేన పార్టీ తరుపున పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో మెగా ఫ్యామిలీ అంతా ఆయనకు సపోర్ట్ చేశారు. వీళ్ళతో పాటూ ఇండస్ట్రీలో చాలా మంది సినీ ప్రముఖులు పవన్ గెలవాలని కోరుకున్నారు. మరికొందరైతే పవన్ తరపున జనసేనకు ప్రచారం కూడా చేశారు.

ఇలాంటి తరుణంలో అల్లు అర్జున్ మాత్రం పవన్ ను కాదని తన చిరకాల మిత్రుడు శిల్పా రవికి మద్దతు ప్రకటిస్తూ స్వయంగా ఎన్నికల కొన్ని గంటలకు ముందు నంద్యాలకు వెళ్లి హల్చల్ చేశాడు. దీంతో మెగా ఫ్యాన్స్ బన్నీపై ఫైర్ అవుతూ సోషల్ మీడియాలో ఆయన్ని ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు.

Also Read : రజినీకాంత్ ‘కూలీ’ లో మలయాళ స్టార్ హీరో!

ఈ సంఘటన జరిగిన అనంతరం నాగబాబు సైతం బన్నీని ఉద్దేశిస్తూ పరోక్షంగా చేసిన ట్వీట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇక్కడితో మెగా ఫ్యామిలీకి బన్నీకి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఇక తాజాగా మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఏకంగా సోషల్ మీడియాలో బన్నీని అన్ ఫాలో చేయడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మెగా ఫ్యామిలీ Vs అల్లు ఫ్యామిలీ

మెగా హీరో సాయి ధరమ్ తాజాగా తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అయిన ఇన్ స్టాగ్రామ్,ట్విట్టర్ లో అల్లు అర్జున్ ను అన్ ఫాలో చేశాడు. దీంతో మెగా, అల్లు ఫ్యామిలీస్ మధ్య విబేధాలు మరోసారి బయటపడ్డాయి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

#sai-durga-tej #pawan-kalyan #allu-arjun
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe