World Cup:ఇలా రెండు బాల్స్ ఇచ్చుంటే సచిన్ డబుల్ పరుగులు చేసేవాడు..

వరల్డ్ కప్ 2023లో పరుగుల వరద పారుతోంది. చిన్న టీమ్ లు కూడా భారీ స్కోర్లు చేశాయి. ఒక్కొక్కరూ సెంచరీలు సునాయసంగా బాదేస్తున్నారు. దీనంతటికీ కారణం రెండు బాల్స్‌తో ఆడడమే అన్న వాదన వినిపిస్తోంది. దీనికి మాజీలు సైతం వత్తాసు పలుకుతున్నారు.

World Cup:ఇలా రెండు బాల్స్ ఇచ్చుంటే సచిన్ డబుల్ పరుగులు చేసేవాడు..
New Update

టీ20లు వచ్చాక క్రికెట్ లో వేగం పెగిరిపోయింది. పరుగులు సునాయసంగా వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు వన్డేల్లో 250 స్కోరు దాటడం అంటే చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు 300 అంతకంటే ఎక్కువే కొడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో కూడా ఇదే పరిస్థితి. ఇప్పటివరకూ జరిగిన అన్ని మ్యాచ్ లలో 280 దాటే స్కోరులు చేశాయి టీమ్ లు. దీనికి మొదటి కారణం భారత్ లో పిచ్‌లు అయితే రెండో కారణం బంతి.

Also Read:సెమీస్ సమరంలో భారత్-న్యూజిలాండ్ – లైవ్ అప్డేట్స్

వరల్డ్ కప్‌లో ప్రతీ ఇన్నింగ్స్‌కు రెండు బాల్స్ వాడుతున్నారు. 30 ఓవర్ల వరకఊ ఒక బంతితో ఆడితే...తరువాత ఓవర్లకు కొత్త బాల్ ఇస్తున్నారు. ఇది బ్యాటర్లకు బాగా అనుకూలిస్తోంది. దీనివల్ల పరుగులు ఇట్టే వస్తున్నాయి. ఒకేబాల్ తో మొత్తం ఇన్నింగ్స్ అంతా ఆడిస్తే బాల్ రివర్స్ స్వింగ్ కు అలవాటు పడుతుంది. పేసర్లు బాల్ ను బాగా స్వింగ్ చేయగలుగుతారు. రివర్స్ స్వింగ్ లో బంతిని హ్యండల్ చేయడం కష్టం. అప్పుడు పరుగులు కూడా ఎక్కువ రావు. కానీ 30 ఓవర్ల తర్వాత బంతిని మార్చేస్తుండడం వలన ఈ రివర్స్ స్వింగ్ కుదరడం లేదు. దాంతో బ్యాటర్లు ఈజీగా పరుగులు చేయగలుగుతున్నారు.

ఇదే విషయాన్ని ఎత్తి చూపిస్తున్నారు మాజీ క్రికెట్ ప్లేయర్లు. ఆర్ట్ ఆఫ్ ద రివర్స్ స్వింగ్ ను కాపాడండి అంటున్నాడు పాకిస్తాన్ బౌలర్ యూనిస్ ఖాన్. దీని మీద సీనియర్ ఆటగాళ్ళు స్పందించాలని కోరుతున్నారు. యునీస్ కాన్ అప్పీల్ ను శ్రీలంక మాజీ బ్యాట్స్ మన్ సనత్ జయసూర్య కూడా ఒప్పుకుంటున్నాడు. యునీస్ ఖాన్ చెప్పినదానికి తాను పూర్తిగా ఒప్పుకుంటున్నాని అంటున్నారు. ఇలా మాకాలంలో రెండు బాల్స్ ఇస్తే...అది కూడా పవర్ ప్లే టైమ్ లో వేరే లెవెల్ ఉండేదని చెబుతున్నారు. సచిన్ ఖాతాలో ఉన్న రన్స్, సెచరీలు డబుల్ అయ్యేవని జయసూర్య వ్యాఖ్యానించారు.

#cricket #icc-world-cup-2023 #balss #sanath-jayasurya #waqaur-uins
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe